Fish Production : అపోలోఫిష్ , రూప్ చంద్ చేపపిల్లల ఉత్పత్తి

సాధారణంగా జూన్ నుండి ఆగస్టు వరకు చేపల గుడ్ల ఉత్పత్తి ఉంటుంది. అయితే మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా ప్రేరిపిత సంతానోత్పత్తి చేస్తున్నారు. ఇందుకోసం ఇంజక్షన్లు ఇచ్చి తద్వారా గుడ్ల ఉత్పత్తి చేస్తున్నారు. ఆ గుడ్లను ట్యాంకుల్లో వదిలి పిల్లలుగా మార్చి నెలరోజుల పాటు పెంచి రైతులకు అందిస్తున్నారు. 

Fish Production : అపోలోఫిష్ , రూప్ చంద్ చేపపిల్లల ఉత్పత్తి

Fish Production

Updated On : June 18, 2023 / 12:26 PM IST

Fish Production : ఉభయగోదావరి జిల్లాల్లో మంచినీటి చేపలైన కార్ప్ జాతి చేపల పెంపకం అధికం. అయితే  కొన్ని వ్యాధుల కారణంగా వీటి సాగు నష్టాల బరితంగా మారింది. అయితే రైతులు ఇప్పుడు ప్రత్యామ్నాయంగా తక్కువ పెట్టుబడి.. తక్కువ సమయంలో పెరిగే చేప జాతులయిన ఫంగస్, రూప్ చంద్ వంటి చేపల పెంపకానికి మొగ్గుచూపుతున్నారు. అయితే వీటి సీడ్ కొరత ఉండటంతో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు ఫంగస్, రూప్ చండ్ చేపల పిల్లల ఉత్పత్తి చేస్తున్నారు.

READ ALSO : Integrated Agriculture : సమీకృత వ్యవసాయంతోనే స్థిరమైన ఆర్థిక వృద్ధి.. రైతుకు భరోసానిస్తున్న పలు పంటలు, అనుబంధ రంగాలు

భారతదేశంలో చేపల పెంపకంలో కార్ప్ జాతి చేపలు ప్రముఖపాత్ర వహిస్తున్నాయి. మనదేశంలో చేపల పెంపకం ద్వారా జరిగే మొత్తం ఉత్పత్తిలో 85 శాతం ఈ కార్ప్ కల్చర్ చేపలదే. అయితే ఇటీవల కాలంలో పలు రకాల వైరస్ లు విజృబిస్తుండటంతో.. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపధ్యంలో తక్కువ పెట్టుబడి.. తక్కువ సమయంలో పెరిగే ప్రత్యామ్నాయ తెల్లచేపల పెంపకం పట్ల రైతులు మొగ్గుచూపుతున్నారు.

READ ALSO : Telangana : వరికి ప్రత్యామ్నాయంగా ఈ పంటలు వేసుకోవాలి

ఈ కోవకే చెందినదే ఫంగస్, రూప్ చంద్ చేపలు. అపోలో ఫిష్‌గా, ఫిష్‌ స్టాటర్స్‌గా ఉపయోగించే ఫంగస్ చేపకు స్టార్‌ హోటల్స్‌ నుంచి సాధారణ హోటల్స్‌ వరకు డిమాండ్‌ ఎక్కువ. అందుకే ఈ చేప పిల్లల ఉత్పత్తి చేపట్టారు పశ్చిమగోదావరి జిల్లా,  ఉండి మండలం, కోళ్లపర్రు గ్రామానికి చెందిన రైతు నరసింహారావు.

READ ALSO : Cultivation Of Inter Crops : అంతర పంటల సాగుతో.. అధికలాభాలు ఆర్జిస్తున్న రైతు

సాధారణంగా జూన్ నుండి ఆగస్టు వరకు చేపల గుడ్ల ఉత్పత్తి ఉంటుంది. అయితే మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా ప్రేరిపిత సంతానోత్పత్తి చేస్తున్నారు. ఇందుకోసం ఇంజక్షన్లు ఇచ్చి తద్వారా గుడ్ల ఉత్పత్తి చేస్తున్నారు. ఆ గుడ్లను ట్యాంకుల్లో వదిలి పిల్లలుగా మార్చి నెలరోజుల పాటు పెంచి రైతులకు అందిస్తున్నారు.  అయితే ప్రభుత్వం తరుపున ప్రోత్సాహాకాలందిస్తే.. మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందంటున్నారు రైతులు.