Cultivation Of Inter Crops : అంతర పంటల సాగుతో.. అధికలాభాలు ఆర్జిస్తున్న రైతు

ఎకరంలో కొద్ది పాటి విస్తీర్ణంలో స్థానికంగా దొరికే కర్రలతో పందిర్లను ఏర్పాటు చేసి  బీర, కాకర సాగుచేస్తుండగా.. ఆ పందిళ్లకింద అంతర పంటగా పొదచిక్కుడు, బంతి, వంగ, సొర, దోస సాగుచేస్తున్నారు. మిగితా విస్తీర్ణంలో బెండను సాగుచేస్తూ.. ఒక పంట తరువాత ఒక పంట దిగుబడులను పొందుతున్నాడు.

Cultivation Of Inter Crops : అంతర పంటల సాగుతో.. అధికలాభాలు ఆర్జిస్తున్న రైతు

cultivation of inter-crops

Cultivation Of Inter Crops : తక్కువ ఖర్చుతో స్వల్పకాలంలో ఆదాయంచేతికొచ్చే పంటలలో కూరగాయలది మొదటిస్థానంగా చెప్పుకోవచ్చు. ధరల్లో హెచ్చుతగ్గులున్నా, ఒక కోతలో కాకపోతే మరోకోతలో.. ఒకపంటలో కాకపోతే మరో పంటలో మెరుగైన రాబడి వస్తుండటంతో.. కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు ప్రణాళిక బద్ధంగా, ఎకరాల్లో అంతర పంటలుగా పలు రకాల కూరగాయల ను సాగుచేస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నాడు.

READ ALSO : Varieties Of Jagitya Rice : ఖరీఫ్ కు అనువైన జగిత్యాల వరి రకాలు

రైతే పేరు ఆళ్ల సత్యనారాయణ.. ఒకే పొలంలో బీర, కాకర లాంటీ తీగజాతి కూరగాయలు.. వాటి కింద అంతర పంటలుగా బంతి, వంగ, సొర, దోస ఆపక్కనే  బెండ సాగు కనబడుతుంది కదూ.. ప్రణాళిక బద్దంగా సాగుచేస్తున్నారు. కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలం, పొనుకుమాడు గ్రామానికి చెందిన ఈయన అంతర పంటలుగా పలు రకాల కూరగాయలను సాగుచేస్తూ.. నిరంతరం పంట దిగుబడులను తీస్తున్నాడు.

READ ALSO : Viral Video: కెమికల్స్‌లో ముంచిన కూరగాయలు.. తర్వాత ఏమైందో తెలిస్తే షాక్

ఒక పంట కాదు…రకరకాల ఉద్యాన పంటలతో సేధ్యంలో సత్ఫలితాలకు నిదర్శనంగా నిలుస్తుంది ఈ క్షేత్రం. అంతర, మిశ్రమపంటలతో, సరికొత్తసాగు విధానాలతో వ్యవసాయంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు రైతు ఆళ్ల సత్యనారాయణ. ఎకరంలో కొద్ది పాటి విస్తీర్ణంలో స్థానికంగా దొరికే కర్రలతో పందిర్లను ఏర్పాటు చేసి  బీర, కాకర సాగుచేస్తుండగా.. ఆ పందిళ్లకింద అంతర పంటగా పొదచిక్కుడు, బంతి, వంగ, సొర, దోస సాగుచేస్తున్నారు. మిగితా విస్తీర్ణంలో బెండను సాగుచేస్తూ.. ఒక పంట తరువాత ఒక పంట దిగుబడులను పొందుతున్నాడు. వచ్చిన దిగుబడులను చాలా వరకు తోట వద్దే అమ్మతూ.. అధిక లాభాలను ఆర్జిస్తున్నారు.