Kushi : ఖుషి నుంచి రెండో సాంగ్ వచ్చేసింది.. ‘ఆరాధ్య’ అంటూ సామ్‌ని ఆరాధిస్తున్న విజయ్..

విజయ్, సమంత రొమాంటిక్ ఎంటర్టైనర్ ఖుషి నుంచి సెకండ్ సింగల్ వచ్చేసింది. మణిరత్నం సినిమా టైటిల్స్ తో మొదటి పాటకి లిరిక్స్ రాసిన శివ నిర్వాణ..

Kushi : ఖుషి నుంచి రెండో సాంగ్ వచ్చేసింది.. ‘ఆరాధ్య’ అంటూ సామ్‌ని ఆరాధిస్తున్న విజయ్..

Aradhya song released from Vijay Deverakonda Samantha Kushi

Updated On : July 12, 2023 / 4:25 PM IST

Kushi : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) కలిసి నటిస్తున్న లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఖుషి’. లవ్ స్టోరీస్ ని బాగా తెరకెక్కించే శివ నిర్వాణ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ‘నా రోజా నువ్వే’ సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు సెట్ చేసింది. తాజాగా ఇప్పుడు మరో సాంగ్ ని రిలీజ్ చేశారు.

Samajavaragamana : ‘సామజవరగమన’ కలెక్షన్స్ దూకుడు ఆగేలా లేదు.. ఈ ఏడాది మరో చిన్న సినిమా సంచలనం..

మణిరత్నం సినిమా టైటిల్స్ తో మొదటి పాటకి లిరిక్స్ రాసిన శివ నిర్వాణ.. ఆరాధ్య పాటకి కూడా సాహిత్యం అందిస్తున్నాడు. ఈ లిరిక్స్ కూడా అందర్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక ఈ పాటని సిద్ శ్రీరామ్, చిన్మయి పాటని పాడారు. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారు.

Lal Salaam : లాల్ సలామ్‌ షూటింగ్‌కి గుడ్ బై అంటున్న మొయ్దీన్ భాయ్‌.. అలియాస్ రజినీకాంత్!

ఇక ఈ మూవీ చిత్రీకరణ విషయానికి వస్తే.. సమంత అనారోగ్యం కారణంతో షూటింగ్ లేటు అవుతూ వచ్చింది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తి అవ్వడంతో చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొదలు పెట్టారు. సెప్టెంబర్ 1న ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. విజయ్, సమంత గత సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ లుగా నిలిచాయి. దీంతో వీరిద్దరి అభిమానులు ఒక్క హిట్టు కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ మూవీ వారి కోరికను నెరవేరుస్తుందా? లేదా? చూడాలి.