New Uniform For Indian Army: ఆర్మీకి కొత్త యూనిఫాం!

అతి త్వరలో ఇండియన్ ఆర్మీ లుక్ మారిపోనుంది. వచ్చే ఏడాది నుంచి అధికారులు మరియు పురుషుల కోసం కొత్త డిజిటల్ ప్యాటర్న్ కంబాట్ యూనిఫాంను ప్రవేశపెట్టాలని ఆర్మీ నిర్ణయించింది.

New Uniform For Indian Army: ఆర్మీకి కొత్త యూనిఫాం!

Army

Army Uniform : అతి త్వరలో ఇండియన్ ఆర్మీ లుక్ మారిపోనుంది. వచ్చే ఏడాది నుంచి అధికారులు మరియు పురుషుల కోసం కొత్త డిజిటల్ ప్యాటర్న్ కంబాట్ యూనిఫాంను ప్రవేశపెట్టాలని ఆర్మీ నిర్ణయించింది. ఆలివ్(ముదురు పసుపు పచ్చ రంగు),మట్టి రంగులతో పాటు పలు రంగుల మిశ్రమంగా ఉండే కొత్త కంబాట్ యూనిఫాంను ఆర్మీ ప్రధాన కార్యాలయం ఖరారు చేసిందని,వచ్చే ఏడాది ఆగస్టు-15న ఢిల్లీలో జరిగే ఆర్మీ డే పరేడ్‌లో ఈ డ్రెస్ ప్రదర్శించబడుతుందని రక్షణ వర్గాలు తెలిపాయి.

కొత్త కాంబాట్ యూనిఫాం “తేలికైన కానీ ధృడమైన పదార్థం”తో తయారు చేయబడుతుందని, ఇది వేసవి మరియు చలికాలం రెండింటికీ అనుకూలంగా ఉంటుందని రక్షణ వర్గాలు తెలిపాయి. కొత్త యూనిఫాంలో… ప్రస్తుతమున్నట్లు షర్ట్స్ టకింగ్ చేయడం కూడా ఉండదని తెలిపాయి.

యుద్ధంలో సైనికుడి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని యూనిఫాం ఎంపిక చేయబడినట్లు ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఆధునిక యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకుని యూనిఫాం మార్చవలసిన అవసరం చాలా కాలంగా ఆలోచిస్తున్నదే అని తెలిపారు. కాగా, వివిధ కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్ర పోలీసులు మరియు ఈశాన్య ప్రాంతంలోని తిరుగుబాటుదారులు కూడా ఇలాంటి యూనిఫాం ధరించడం ఇప్పటికే ప్రారంభించారు.

మరోవైపు, సైన్యానికి కూడా ప్రస్తుతం వాడుకలో ఉన్న ఆలివ్ యూనిఫాం స్థానంలో భిన్నంగా ఉండే కొత్త రెగ్యులర్ యూనిఫాం తీసుకురావాలని ఆర్మీ యోచిస్తున్నట్లు సమాచారం.

ALSO READ Mamata Banerjee : UPA లేదు,ప్రత్యామ్నాయం అవసరం..పవార్ తో భేటీ తర్వాత దీదీ