Minister KTR : సూట్ కేసులో సత్యనారాయణ స్వామి వ్రత మండపం .. వీడియో షేర్ చేసిన మంత్రి కేటీఆర్
ఓ కళాకారుడు ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లేలా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపాన్ని తయారు చేశాడు. ఆ వీడియోను మంత్రి కేటీఆర్ షేర్ చేశారు.

Satyanarayana Swamy Mandapam folding in suit case
Satyanarayana Swamy Vratam Mandapam fit in suitcase : సత్యనారాయణ స్వామి వత్రం చేసుకోవాలంటే మండపం చాలా ప్రధానంగా ఉండాలి. మండపానికి చక్కటి అలంకరణలు కూడా ప్రధానమే. మంగళప్రదంగా కనిపించాలంటే పువ్వులు, ఆకులులతో చక్కగా అలంకరిస్తే సత్యనారాయణ స్వామి సంతోషించి వరాలు కురిపిస్తాడట. వ్రతం నిష్టగా చేసిన ప్రసాదం స్వీకరించే వరకు సత్యనారాయన స్వామి వ్రతంలో అన్ని ముఖ్య ఘట్టాలే. పూజా విధానం నుంచి కథలు వినే ప్రక్రియ..ప్రసాదం స్వీకరించే వరకు స్వామివారి వ్రతంలో అన్ని చాలా నిష్టగాచేయాల్సి ఉంటుంది.
అటువంటి సత్యనారాయణ స్వామి వ్రతంలో మండపం గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోది. ఓ కళాకారుడు మండపాన్ని తయారు చేసిన విధానం ..దాన్ని ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లేలా చేసిన విధానం చాలా ఆకట్టుకుంటోంది. కళాకారుడి ప్రతిభ ఈ మండపం గురించి మంత్రి కేటీఆర్ వీడియోను షేర్ చేశారు.
సాధారణంగా మండపాన్ని తీసుకెళ్లాలంటే కాస్త కష్టమే. ఓ వాహనం ఉండాల్సిందే. ద్విచక్ర వాహనం అయితే ఒకరు డ్రైవ్ చేస్తే మండపాన్ని ఒకరు పట్టుకుని కూర్చోవాలి. కానీ ఓ కళాకారుడు మాత్రం మండపాన్ని మడిచి సూట్ కేసులో అమరిపోయేలా దాన్ని తిరిగి ఈజీగా సెట్ చేసుకునేలా తయారు చేశాడు. మండపాన్ని భాగాలుగా విడదీసి..దాన్ని సూట్ కేసులో పెట్టేసి తిరిగి ఈజీగా నిర్మించేలా తయారు చేశాడు. సూట్ కేసులో సత్యనారాయణ స్వామి మండపం ఇమిడిపోయేలా తయారు చేసిన కళాకారుడి ప్రతిభ కనిపిస్తోంది ఈ వీడియోలో..ఇలా సూట్ కేసులో ఇమిడిలే తయారు చేసిన ఈ మండపాన్ని ఒకచోటి నుంచి మరోచోటికి తీసుకెళ్లటా చాలా చాలా ఈజీగా ఉంది. మరి మీరు కూడా ఓ లుక్కేయండీ సూట్ కేసులో సత్యనారాయణ స్వామి వారి మండపంపై..
Absolutely great skill
Request @TWorksHyd to reach out to see how we could help https://t.co/KQe8zKOrCY
— KTR (@KTRBRS) August 16, 2023