Aryan Khan: డ్రగ్స్ కేసు.. ఆర్యన్ ఖాన్‌కు క్లీన్‌చిట్

గతేడాది సంచలనం సృష్టించిన ముంబై క్రుయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్‌ ఖాన్‌కు క్లీన్ చిట్ లభించింది. ‘ద నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆఫ్ ఇండియా (ఎన్సీబీ)’ ఆర్యన్‌ ఖాన్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన చార్జిషీట్లను ఉపసంహరించుకుంది.

Aryan Khan: డ్రగ్స్ కేసు.. ఆర్యన్ ఖాన్‌కు క్లీన్‌చిట్

Aryan Khan

Aryan Khan: గతేడాది సంచలనం సృష్టించిన ముంబై క్రుయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్‌ ఖాన్‌కు క్లీన్ చిట్ లభించింది. ‘ద నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆఫ్ ఇండియా (ఎన్సీబీ)’ ఆర్యన్‌ ఖాన్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన చార్జిషీట్లను ఉపసంహరించుకుంది. ఆర్యన్‌ ఖాన్‌తోపాటు మరో ఐదుగురికి కూడా ఈ కేసులో క్లీన్ చిట్ ఇచ్చింది. సరైన ఆధారాలు లేనందున ఆరుగురికి క్లీన్ చిట్ లభించింది.

Fake Reviews: ఆన్‌లైన్‌ ఫేక్ రివ్యూలపై కేంద్రం దృష్టి

గత ఏడాది అక్టోబర్ 2న ఒక క్రుయిజ్ షిప్‌లో ఉండగా ఆర్యన్‌ ఖాన్‌తోపాటు మరో 19 మందిని ఎన్సీబీ అరెస్టు చేసింది. డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నారనే కారణంతో వీళ్లందరిపై డ్రగ్స్ కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్ 3న ఆర్యన్‌ ఖాన్‌ను అరెస్టు చేశారు. దాదాపు 22 రోజులు ముంబైలోని ఆర్థర్ జైలులో శిక్ష అనుభవించాడు ఆర్యన్‌ ఖాన్‌. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలతో మొత్తం 20 మందిపై ఎన్సీబీ చార్జిషీటు దాఖలు చేసింది. వీళ్లలో తాజాగా ఆరుగురికి ఎన్సీబీ క్లీన్ చిట్ ఇచ్చింది. మరో పద్నాలుగు మందిని నిందితులుగా పేర్కొంది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసుపై విచారణ జరిపిందని, 20 మంది నిందితుల్లో సరైన ఆధారాలు లేని కారణంగా ఆరుగురికి క్లీన్ చిట్ లభించిందని ఎన్సీబీ తెలిపింది.

OP Chautala: అక్రమాస్తుల కేసు.. మాజీ సీఎంకు జైలు శిక్ష

ఈ కేసులో ఎన్సీబీ మొత్తం 6,000 పేజీల చార్జిషీటు దాఖలు చేసింది. కేసు దర్యాప్తు ప్రారంభంలో ఆర్యన్‌ ఖాన్‌, రెగ్యులర్‌గా డ్రగ్స్ వాడుతాడని వాదించింది. అయితే, ఈ వాదనలను ఆర్యన్‌ ఖాన్‌ తరఫు లాయర్లు ఖండించారు. అధికారులు దాడి చేసిన సమయంలో ఆర్యన్‌ ఖాన్‌ దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని లాయర్లు చెప్పారు. కేవలం వాట్సాప్ మెసేజుల ఆధారంగా నిందితుడిపై ఆరోపణలు చేయడం తగదని ఆర్యన్‌ ఖాన్‌ లాయర్లు వాదించారు. ఈ నేపథ్యంలో సరైన ఆధారాలు లేని కారణంగా ఆర్యన్‌ ఖాన్‌కు క్లీన్ చిట్ లభించింది.