Fake Reviews: ఆన్‌లైన్‌ ఫేక్ రివ్యూలపై కేంద్రం దృష్టి

ఈ కామర్స్ సైట్లలో అనేక ఉత్పత్తులకు ఫేక్ రివ్యూలు ఎక్కువ అవుతుండటంపై కేంద్రం స్పందించింది. ఈ అంశంపై ఇ-కామర్స్ సైట్ల నిర్వాహకులతో మీటింగ్ జరుపబోతుంది. ఫేక్ రివ్యూలు ఎలా వస్తున్నాయి.. వాటిని అడ్డుకోవడంపై రోడ్ మ్యాప్ వంటి విషయాలపై కేంద్రం ఆయా సంస్థలతో చర్చలు జరపనుంది.

Fake Reviews: ఆన్‌లైన్‌ ఫేక్ రివ్యూలపై కేంద్రం దృష్టి

Fake Reviews

Fake Reviews: ఈ కామర్స్ సైట్లలో అనేక ఉత్పత్తులకు ఫేక్ రివ్యూలు ఎక్కువ అవుతుండటంపై కేంద్రం స్పందించింది. ఈ అంశంపై ఇ-కామర్స్ సైట్ల నిర్వాహకులతో మీటింగ్ జరుపబోతుంది. ఫేక్ రివ్యూలు ఎలా వస్తున్నాయి.. వాటిని అడ్డుకోవడంపై రోడ్ మ్యాప్ వంటి విషయాలపై కేంద్రం ఆయా సంస్థలతో చర్చలు జరపనుంది.

Leopard Burnt: చిరుతను సజీవ దహనం చేసిన గ్రామస్తులు.. 150 మందిపై కేసు

కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో, అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో కలిసి ఈ రోజు (శుక్రవారం) వర్చువల్‌గా ఈ మీటింగ్ జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ‘‘ఫేక్ రివ్యూల వల్ల వినియోగదారులపై పడుతున్న ప్రభావం.. ఈ రివ్యూలు ఎలా తప్పుదోవ పట్టిస్తున్నాయి.. వీటిని అడ్డుకునేందుకు ఉన్న అవకాశాలు.. వంటి అంశాలపై చర్చిస్తాం’’ అని కేంద్ర శాఖ తెలిపింది. ఇటీవల కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ సెక్రటరీ రోహిత్ కుమార్ సింగ్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, టాటా సన్స్, రిలయన్స్ వంటి సంస్థలకు లేఖలు రాశారు. 223 వెబ్‌సైట్లకు సంబంధించిన వివరాలపై యురోపియన్ కమిషన్ ఇచ్చిన ఒక ప్రకటన ఆధారంగా ఈ లేఖ రాశారు.

Ambassador Car: రెండేళ్లలో మళ్లీ రానున్న అంబాసిడర్ కార్

దీని ప్రకారం దాదాపు 55 శాతం వెబ్‌సైట్లు నిబంధనలు ఉల్లంఘించి, అనైతిక వ్యాపార కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి. కచ్చితమైన సమాచారం ఇవ్వడం ద్వారా వినియోగాదారులు తమకు నచ్చింది ఎన్నుకునే అవకాశం కల్పించాలి అని ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, మొత్తం 223 వెబ్‌సైట్లలో 144 వెబ్‌సైట్లు స్పష్టమైన సమాచారం ఇస్తున్నాయో లేదో స్పష్టత లేదని ఆ ప్రకటన తెలిపింది.