Asia Cup 2022 : క్రికెట్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఆగస్టు 27 నుంచి ఆసియా కప్.. ఈసారి టీ20 ఫార్మాట్‌లో..

ఆసియా కప్ 2022 నిర్వహణపై స్పష్టత వచ్చింది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఆసియా కప్ జరగనుంది. టీ20 ఫార్మాట్ లో నిర్వహించే..(Asia Cup 2022)

Asia Cup 2022 : క్రికెట్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఆగస్టు 27 నుంచి ఆసియా కప్.. ఈసారి టీ20 ఫార్మాట్‌లో..

Asia Cup 2022

Asia Cup 2022 : ఆసియా కప్ 2022 నిర్వహణపై స్పష్టత వచ్చింది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఆసియా కప్ జరగనుంది. టీ20 ఫార్మాట్ లో నిర్వహించే ఈ టోర్నమెంట్ కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. ఆగస్టు 20 నుంచి క్వాలిఫయర్స్ జరగనున్నాయి.

ప్రధాన టోర్నమెంట్ ఆగస్టు 27 నుంచి ఆరంభం కానుండగా… టోర్నీ క్వాలిఫయర్స్ మాత్రం ఆగస్టు 20 నుంచి జరుగుతాయి. ఈ మేరకు శనివారం జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ జనరల్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు. ఈ మీటింగ్ కు బీసీసీఐ తరఫున కార్యదర్శి జై షా హాజరయ్యారు. అదే సమయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, అఫ్ఘానిస్తాన్ క్రికెట్ బోర్డుల నుంచి సభ్యులు పాల్గొన్నారు.(Asia Cup 2022)

Sachin Tendulkar: కపిల్ దేవ్ వందో టెస్టు.. సచిన్ టెండూల్కర్ మొదటి టెస్టు అని మీకు తెలుసా..

ఆసియా కప్ గత రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే, ఈసారి నిర్వహణపై క్లారిటీ వచ్చింది. ఆసియా కప్ క్రికెట్ లవర్స్ ను అలరించనుంది. ఐపీఎల్ ముగిసిన రెండు నెలల తర్వాత ఈ ధనాధన్ టోర్నమెంట్ ఆరంభం కానుంది. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేశారు. శ్రీలంక వేదికగా ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఆసియా కప్ టీ20 టోర్నీ జరగనుంది. ఈ మేరకు శనివారం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ప్రకటన విడుదల చేసింది. 1984 నుంచి ఇప్పటివరకు మొత్తం 14 సార్లు ఆసియా కప్ జరిగింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నారు. కాగా, కరోనా వల్ల 2020లో టోర్నీ జరగలేదు. 2021లో నిర్వహించాలని తొలుత అనుకున్నా సాధ్యం కాలేదు.(Asia Cup 2022)

తాజాగా 2022లో ఈ టోర్నమెంట్ ను నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా 14 సార్లు ఆసియా కప్ నిర్వహించగా భారత జట్టు 7 సార్లు గెలిచింది. అత్యధిక సార్లు ఆసియా కప్ టైటిల్ ను గెలిచిన జట్టుగా ఉంది. ఆ తర్వాతి స్థానంలో శ్రీలంక ఐదు టైటిల్స్ తో ఉంది. పాకిస్తాన్ రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్, శ్రీలంక జట్లతో పాటు మరో జట్టు ఆసియా కప్ టోర్నీ ఆడనుంది. యూఏఈ, కువైట్ మధ్య జరిగే క్వాలిఫైయర్ టోర్నీలో గెలిచిన జట్టుకి ఆసియా కప్ టోర్నీ ఆడే అవకాశం దక్కుతుంది. 2021 జూన్‌ లో ఆసియా కప్ నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేసినా.. కరోనా సెకండ్ వేవ్, భారత జట్టు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించిన కారణంగా అప్పుడు కూడా టోర్నీ నిర్వహణ సాధ్యం కాలేదు.(Asia Cup 2022)

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కంటే ముందుగానే ఆసియా కప్ టీ20 టోర్నీలో దాయాదుల పోరు చూసే అవకాశం దక్కనుంది.

IPL 2022 : లక్నో సూపర్‌జెయింట్స్‌కు భారీ షాక్.. దిగ్గజ ప్లేయర్‌ దూరం!

1984లో యూఏఈ వేదికగా ఆసియా కప్ టోర్నీ ప్రారంభమైంది. తొలుత వన్డే ఫార్మాట్‌లో ఈ టోర్నీ నిర్వహించగా.. 2015లో వన్డే, టీ20 ఫార్మాట్లలో ఈ టోర్నీని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ఆసియా క్రికెట్ కౌన్సిల్. రాబోయే ఐసీసీ ఈవెంట్‌ ఫార్మాట్‌ని బట్టి ఆసియా కప్ ఫార్మాట్‌ని నిర్ణయిస్తారు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు జరుగుతున్న టోర్నీ కావడంతో ఈసారి టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్ జరుగుతుంది.

1984, 1988, 1990, 1995, 2010, 2016, 2018 సీజన్లలో టీమిండియా ఆసియా కప్ టైటిల్‌ను గెలిచింది. 1986, 1997, 2004, 2008, 2014 సీజన్లలో శ్రీలంకకి టైటిల్ దక్కింది. 2000వ సంవత్సరంలో తొలిసారి ఆసియా కప్ గెలిచిన పాకిస్తాన్, 2012లో చివరగా గెలిచింది.