England vs Australia Ashes Test: బెన్ స్టోక్స్ పోరాడినా ఫలితం దక్కలే.. రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియాదే విజయం
యాషెస్ సిరీస్ రెండో టెస్టు చివరిరోజు ఆటలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వీరవిహారం చేసినప్పటికీ ఆ జట్టుకు విజయం దక్కలేదు. దీంతో వరుసగా రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా జట్టు విజేతగా నిలిచింది.

England vs Australia Ashes 2nd Test
Ashes 2nd Test: ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు (Ashes Test) లో ఇంగ్లాండ్ జట్టు (England Team) మరోసారి ఓటమి చవిచూసింది. ఉత్కంఠభరితంగా సాగిన రెండో టెస్టులో 43 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా (Australia) విజయం సాధించింది. మొత్తం ఐదు టెస్టు మ్యాచ్‌ల యాషెస్ సిరీస్ (Ashes series) లో వరుసగా రెండు మ్యాచ్ లలో ఇంగ్లాండ్ ఓడిపోవటంతో ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో టెస్టు చివరిరోజు ఆటలో కెప్టెన్ బెన్ స్టోక్స్ అద్భుత ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ఇంగ్లాండ్ జట్టు ఆసీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించలేక పోయింది.
BCCI Announces Women’s Squad : బంగ్లాదేశ్ సిరీస్‌కు భారత మహిళల జట్టు… బీసీసీఐ ప్రకటన
రెండో టెస్టులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 416 పరుగులు చేసింది. ఆ తరువాత ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లాండ్ జట్టు 325 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 91 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 279 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంలో పరుగులతో కలిపి ఇంగ్లాండ్ జట్టుకు 371 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ నిర్ధేశించింది. ఇంగ్లాండ్ జట్టు నాలుగో రోజు ఆటను 114/4 వద్ద ముగించింది. చివరి రోజు (ఆదివారం) ఆటలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అసాధారణ పోరాటంతో ఆస్ట్రేలియా ఓటమి అంచులకు వెళ్లినట్లు కనిపించింది.
ICC World Cup 2023 : వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించిన శ్రీలంక.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే
బెన్ స్టోక్స్ వీరవిహారం చేయడంతో 214 బంతులు ఎదుర్కొని 155 పరుగులు చేశాడు. బెన్ స్టోక్స్ దూకుడుతో ఇంగ్లాండ్ జట్టు విజయంపై ఆశలు రేకెత్తాయి. కానీ, జోరుమీదున్న స్టోక్స్‌ను హేజిల్‌వుడ్ ఔట్ చేయడంతో ఆస్ట్రేలియా ఊపిరి పీల్చుకుంది. ఆ తరువాత మిగిలిన బ్యాట్స్‌మెన్లు వెంటవెంటనే పెవిలియన్ బాటపట్టడంతో 43 పరుగులతో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధిచింది. మూడో టెస్టు జూలై 6 నుంచి లీడ్స్ వేదికగా జరుగుతుంది.