Avatar 2 : లండన్‌ లో ప్రివ్యూ.. అవతార్ 2 ఫస్ట్ రివ్యూ ఇదే..

‘అవతార్ 2’ ను రీసెంట్ గా లండన్ లో లిమిటెడ్ మెంబర్స్ కు ప్రివ్యూ వేసి చూపించారు. చూసిన ప్రతీ ఒక్కరు సినిమా అద్బుతం అంటూ ట్వీట్ చేశారు. ‘అవతార్ ది వే ఆఫ్ వాటర్’ మూవీ టెక్నికల్ గా ఎంతో గొప్పది. ఫస్ట్ పార్ట్ కన్నా...............

Avatar 2 : లండన్‌ లో ప్రివ్యూ.. అవతార్ 2 ఫస్ట్ రివ్యూ ఇదే..

Avatar 2 movie first review

Avatar 2 :  రిలీజ్ డేట్ దగ్గరకొస్తుండడంతో ‘అవతార్ 2’ ఫీవర్ మొదలైపోయింది. డైరెక్టర్ జేమ్స్ కెమరూన్ అందించబోయే విజువల్ ఫీస్ట్ కోసం ఎంటైర్ వరల్డ్ ఎదురు చూస్తోంది. ఫస్ట్ పార్ట్ రేంజ్ లో ఈ మూవీ కూడా భారీ వసూళ్ళు సాధిస్తాయని అంచనా వేస్తున్నారు.

ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ‘అవతార్ 2’ రిలీజ్ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. పదమూడేళ్ళ క్రితం రిలీజయి సెన్సేషన్ క్రియేట్ చేసిన అవతార్ నుంచి రాబోయే సీక్వెల్స్ లో ఇది ఒకటి. ప్రకృతికి, మానవుడికి ఆక్రమణకు మధ్య జరిగే పోరాటంగా అవతార్ ఫస్ట్ పార్ట్ తెరకెక్కింది. జేమ్స్ కెమరూన్ అద్భుతమైన టేకింగ్ సినిమాకి మెయిన్ పిల్లర్ గా నిలిచింది. ఈ మూవీ సెకండ్ పార్ట్ నిజానికి ఎప్పుడో రిలీజవ్వాలి. అయితే అండర్‌వాటర్ పర్మార్మెన్స్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించడం వలన పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావడంతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది.

‘అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్’ మూవీ ఈ నెల 16న ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతోంది. తెలుగులో కూడా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న అవతార్ 2కు ప్రసాద్ ఐమాక్స్ రెడీ అయింది. అతి పెద్ద స్క్రీన్ లో సినిమాను ప్రదర్శించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మూవీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ ఫస్ట్ పార్ట్ ను మించి ఉండబోతోందనే హింటిచ్చింది. విజువల్ గా వండర్స్ ను క్రియేట్ చేయబోతోందని అర్ధమవుతోంది. దానికి తగ్గట్టుగానే రీసెంట్ గా వచ్చిన ‘అవతార్ 2’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూస్ సినిమా అద్బుతం అంటూ చెబుతున్నాయి. సెకండ్ పార్ట్ ఎమోషనల్ గా కూడా వండర్ అనిపించుకుంటుందని క్రిటిక్స్ అంటున్నారు.

Pooja Hegde : బుట్టబొమ్మకి కలిసిరాని 2022.. ఇయర్ ఎండింగ్ అయినా హిట్ కొడుతుందా?

‘అవతార్ 2’ ను రీసెంట్ గా లండన్ లో లిమిటెడ్ మెంబర్స్ కు ప్రివ్యూ వేసి చూపించారు. చూసిన ప్రతీ ఒక్కరు సినిమా అద్బుతం అంటూ ట్వీట్ చేశారు. ‘అవతార్ ది వే ఆఫ్ వాటర్’ మూవీ టెక్నికల్ గా ఎంతో గొప్పది. ఫస్ట్ పార్ట్ కన్నా ఎంతో ఎమోషనల్ గా ఉంది. స్టోరీ, స్ర్కీన్ ప్లే, స్పిరిట్యువాలిటీ, బ్యూటీ, మూవీ మేకింగ్, స్టోరీ టెల్లింగ్.. అన్నీ పెర్ఫెక్ట్ గా కుదిరి సినిమాని గొప్పగా తీర్చిదిద్దాయి అంటూ ఫేమస్ క్రిటిక్ ఎరిక్ డేవిస్ సినిమాపై తన అభిప్రాయాన్ని చెప్పాడు. మరికొందరు కూడా సినిమాపై చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. దాంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి. మరి ఈ సినిమా నిజంగానే అంత అద్భుతమో కాదో తెలియాలంటే ఈ నెల 16 వరకూ వెయిట్ చేయాల్సిందే.