B S Yediyurappa : “బెస్ట్ ఎమ్మెల్యే” అవార్డు అందుకున్న యడియూరప్ప

కర్ణాటక మాజీ సీఎం,ఎనిమిదిసార్లు ఎమ్మెల్యే బీఎస్ యడియూరప్పను 2020-21 సంవత్సరానికి ఉత్తమ శాసనసభ్యుడిగా ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎంపిక చేసింది.

B S Yediyurappa : “బెస్ట్ ఎమ్మెల్యే” అవార్డు అందుకున్న యడియూరప్ప

Bsy

B S Yediyurappa కర్ణాటక మాజీ సీఎం,ఎనిమిదిసార్లు ఎమ్మెల్యే బీఎస్ యడియూరప్పను 2020-21 సంవత్సరానికి ఉత్తమ శాసనసభ్యుడిగా ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎంపిక చేసింది. అసెంబ్లీ స్పీకర్ నేతృత్వంలోని.. సీఎం,ప్రతిపక్ష నేత సిద్దరామయ్య,న్యాయశాఖ మంత్రి మధుస్వామిలతో కూడిన కమిటీ ఈ అవార్డుకి యడియూరప్పని ఎంపిక చేసింది. ఎన్నికల రాజకీయాల్లో సుదీర్ఘ ప్రయాణం మరియు అసెంబ్లీ సభ్యుడిగా ఉత్తమ ప్రదర్శన కనబర్చినందుకు యడియూరప్పకి ఈ అవార్డు దక్కింది.

శుక్రవారం కర్ణాటక అసెంబ్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా విచ్చేసిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా..యడియూరప్పకి జ్ఞాపికను బహూకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం బసవరాజ్ బొమ్మై,శాసనసభ స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కాగేరి,శాసనమండలి చైర్మన్ బసవరాజ్ హోరట్టి హాజరయ్యారు.

READ Modi-Kamala Harris : యూఎస్ వైస్ ప్రెసిడెంట్‌కి మోదీ అపూర్వ కానుక

లోక్ సభ, రాజ్యసభలో ఏటా అందించే ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డుల మాదిరిగా ఈ ఏడాది నుంచి కర్ణాటక శాసనసభ సభ్యులకు(మంత్రులకు కాదు)ఉత్తమ శాసనసభ్యుడి అవార్డు ఇచ్చే ఒరవడికి శ్రీకారం చుట్టినట్లు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే కగేరి ఈ సందర్భంగా తెలిపారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సూచన మేరకే తాము ఈ అవార్డులను ప్రవేశపెట్టినట్లు చెప్పారు.

ఈ సందర్భంగా లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా మాట్లాడుతూ…మనం ఏర్పాటు చేసుకున్న చట్టాలపై విస్తృతమైన చర్చలు జరపడం మన విధి అని అన్నారు. ఏర్పడిన చట్టాలపై ఎలాంటి ప్రశ్నలు, సందేహాలు లేవనెత్తకుండా ఎమ్మెల్యేలు మరింత చురుకుగా సభా కార్యకలాపాల్లో పాల్గోవాలని సూచించారు.

కాగా,యడియూప్ప 1983లో తొలిసారి కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికయ్యారు. శాసన మండలి,పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఆయన పనిచేశారు. నాలుగు సార్లు సీఎంగా పనిచేసిన యడియూరప్ప.. బీజేపీ హైకమాండ్ ఆదేశాల మేరకు ఈ ఏడాది జులై-26న సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

READ UPSC..నేషనల్ ఢిఫెన్స్,నావల్ అకాడమీ ఎగ్జామ్ కి మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు