Unstoppable 2: పవన్ సాక్షిగా సాయి ధరమ్ తేజ్‌తో ఆటాడుకున్న బాలయ్య
నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్ 2’ టాక్ షోలో ఆయన ఎంత సందడి చేస్తాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వచ్చిన గెస్టులతో సరదాగా ముచ్చటించడమే కాకుండా వారిని ఆటపట్టిస్తూ బాలయ్య చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇక యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా ఓ ప్రోమోను రిలీజ్ చేశారు షో నిర్వాహకులు.

Balakrishna Comedy With Sai Dharam Tej In Unstoppable 2 Pawan Kalyan Episode
Unstoppable 2: నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్ 2’ టాక్ షోలో ఆయన ఎంత సందడి చేస్తాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వచ్చిన గెస్టులతో సరదాగా ముచ్చటించడమే కాకుండా వారిని ఆటపట్టిస్తూ బాలయ్య చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇక యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా ఓ ప్రోమోను రిలీజ్ చేశారు షో నిర్వాహకులు. ఈ షో ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిందని చెప్పాలి.
పవన్‌తో బాలయ్య చేసిన సందడి ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని ఈ ప్రోమో చూస్తే తెలుస్తోంది. పవన్ కూడా చాలా ఫ్రీగా తనదైన స్టయిల్‌లో సమాధానాలు ఇస్తూ.. బాలయ్యతో చేసిన రచ్చ మనకు ఈ ప్రోమోలో చూపెట్టారు. అయితే ఈ ప్రోమోలో మరో అంశం హైలైట్‌గా నిలిచింది. అదే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సర్‌ప్రైజ్ ఎంట్రీ. పంచెకట్టుతో తేజు స్టేజీపైకి రావడంతోనే బాలయ్య ఆయన్ను ఓ రేంజ్‌లో ఆటాడుకున్నారు. ఇవేమన్నా పెళ్లిచూపులా.. అంటూ తేజుకి సెటైర్ వేశాడు బాలయ్య. దీంతో తేజు అమ్మాయిల గురించి మాట్లాడుతూ.. హార్రర్ సినిమాలకి, అమ్మాయిలకి తేడా లేదంటూ బదులిచ్చాడు.
Unstoppable 2: అన్‌స్టాపబుల్ ‘పవర్’ టీజర్.. లాస్ట్ సినిమా అంటూ బాంబ్ పేల్చిన పవన్!
ఈ సమాధానంతో స్టూడియోలోని ఆడియెన్స్ నవ్వుకున్నారు. అయితే తేజు యాన్సర్‌కి ఇంటికెళ్లాక బడితపూజేనా అని పవన్‌ను అడగ్గా.. కొద్దిగా ఉంటుందని పవన్ సరదాగా చెప్పుకొచ్చాడు. అయితే తనకు అమ్మాయిలను ఎలా గౌరవించాలో పవన్ నేర్పించాడని తేజు చెప్పుకురావడం విశేషం. అయితే ఓసారి తొడ కొట్టవా అంటూ తేజుని అడగగా.. బాలయ్య వద్దకు వచ్చి ఆయన తొడను కొట్టే ప్రయత్నం తేజు చేశాడు. దీంతో ‘నా తొడకాదయ్యా..’ అంటూ బాలయ్య అనడంతో పవన్ నవ్వుకున్నాడు. మొత్తానికి తేజుతో బాలయ్య చేసిన సందడి కూడా ఈ పవర్‌ఫుల్ ఎపిసోడ్‌ను మరింత ఆసక్తికరంగా చేయనుందనే విషయం స్పష్టం అవుతోంది.