Unstoppable 2: అన్‌స్టాపబుల్ ‘పవర్’ టీజర్.. లాస్ట్ సినిమా అంటూ బాంబ్ పేల్చిన పవన్!
బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ 2 నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవర్ టీజర్‌ను నిర్వాహకులు తాజాగా రిలీజ్ చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గెస్టుగా వచ్చిన ఈ ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన టీజర్ ఆద్యంతం పవర్‌ప్యాక్డ్‌గా కట్ చేశారు నిర్వాహకులు. పవన్ ఎంట్రీ కూడా సాలిడ్‌గా ఉండబోతున్నట్లు ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది.

Power Teaser Of Pawan Kalyan Episode From Balakrishna Unstoppable 2 Released
Unstoppable 2: బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ 2 నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవర్ టీజర్‌ను నిర్వాహకులు తాజాగా రిలీజ్ చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గెస్టుగా వచ్చిన ఈ ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన టీజర్ ఆద్యంతం పవర్‌ప్యాక్డ్‌గా కట్ చేశారు నిర్వాహకులు. పవన్ ఎంట్రీ కూడా సాలిడ్‌గా ఉండబోతున్నట్లు ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది.
Unstoppable 2: అన్‌స్టాపబుల్ ‘పవర్’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. గెట్ రెడీ!
ఇక పవన్‌తో బాలయ్య చేసిన సందడి మామూలుగా ఉండదు. బాలయ్య వేసే ప్రశ్నలకు పవన్ చెప్పే సమాధానం అభిమానుల్ని ఆకట్టుకుంటుందని ఈ టీజర్‌లో చూపెట్టారు. సినిమాలు, రాజకీయాలు.. ఇలా అన్ని అంశాలపై బాలయ్య పవన్‌ల మధ్య ముచ్చట సాగనుంది. ఇక చిరు నుండి పవన్ ఎలాంటి మంచి, చెడు నేర్చుకున్నాడని బాలయ్య అడగ్గా.. దానికి పవన్ చాలా సుదీర్ఘమైన సమాధానం చెప్పినట్లుగా తెలుస్తోంది.
మధ్యలో తన వదినకు కాల్ చేసి అదే తన లాస్ట్ సినిమా అని పవన్ చెప్పినట్లుగా తెలపడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే సినిమా నుండి రాజకీయాలపై బాలయ్య ఓ పవర్‌ఫుల్ ప్రశ్నను అడిగాడు. పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్న పవన్‌కు వారందరూ ఓట్లు ఎందుకు వేయడం లేదని బాలయ్య స్ట్రెయిట్ క్వశ్చన్ అడిగాడు. దీనికి పవన్ ఎలాంటి సమాధానం ఇచ్చాడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక టీజర్ చివర్లో ‘మేమిద్దరం బ్యాడ్ బాయ్స్’ అంటూ బాలయ్య కౌంట్‌డౌన్ చెబుతుండగా, పవన్ నవ్వుకున్నాడు. మొత్తానికి పవన్ ఎపిసోడ్ ఈ సీజన్‌కే బాప్ ఆఫ్ ఆల్ ది ఎపిసోడ్స్‌గా నిలవనుందని మేకర్స్ సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు.