Unstoppable 2: అన్‌స్టాపబుల్ ‘పవర్’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. గెట్ రెడీ!
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ 2 టాక్ షోకు ఇప్పటికే ఎలాంటి రెస్పాన్స్, క్రేజ్ దక్కుతుందో మనం చూస్తున్నాం. ఈ సీజన్ టాక్ షో చాలా చప్పగా సాగుతుందని అందరూ అనుకుంటున్న వేళ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ టాక్ షోకు రావడంతో ఒక్కసారిగా అన్‌స్టాపబుల్ 2కి బూస్టప్ వచ్చింది. ఇక ప్రభాస్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఈ టాక్ షోను ఏ విధంగా ఆసక్తిగా చూశారంటే, ఏకంగా ఆహా యాప్ క్రాష్ అయ్యేంతలా. అయితే ప్రభాస్ ఈ టాక్ షోకు వచ్చిన ఎపిసోడ్లను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేసింది ఆహా.
Unstoppable 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ 2 టాక్ షోకు ఇప్పటికే ఎలాంటి రెస్పాన్స్, క్రేజ్ దక్కుతుందో మనం చూస్తున్నాం. ఈ సీజన్ టాక్ షో చాలా చప్పగా సాగుతుందని అందరూ అనుకుంటున్న వేళ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ టాక్ షోకు రావడంతో ఒక్కసారిగా అన్‌స్టాపబుల్ 2కి బూస్టప్ వచ్చింది. ఇక ప్రభాస్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఈ టాక్ షోను ఏ విధంగా ఆసక్తిగా చూశారంటే, ఏకంగా ఆహా యాప్ క్రాష్ అయ్యేంతలా. అయితే ప్రభాస్ ఈ టాక్ షోకు వచ్చిన ఎపిసోడ్లను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేసింది ఆహా.
Unstoppable 2: రేపే అన్‌స్టాపబుల్ ‘పవర్’ఫుల్ ఎపిసోడ్ గ్లింప్స్!
ఇక ఇప్పుడు అందరి చూపులు అన్‌స్టాపబుల్ 2లో పవర్ఫుల్ ఎపిసోడ్‌పైనే ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఈ టాక్ షోలో పాల్గొన్నాడని తెలుసుకుని, ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన టీజర్ అప్డేట్ను ఆహా అనౌన్స్ చేసింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవర్ఫుల్ ఎపిసోడ్‌కు సంబంధించిన పవర్ టీజర్‌ను ఇవాళ రాత్రి 8 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ఆహా తెలిపింది.
దీంతో అభిమానులు ఒక్కసారిగా ‘పవన్ కల్యాణ్ ఆన్ ఆహా’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్ చేస్తున్నారు. ఇక ఈ టీజర్ రిలీజ్ కావడంతోనే వారు దుమ్ములేపేందుకు రెడీ అవుతున్నారు. బాలయ్య ప్రశ్నలకు పవన్ సమాధానాలు ఎలా ఉండబోతున్నాయా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ ఎపిసోడ్‌ను ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తారో ఇవాల్టి పవర్ టీజర్లో అనౌన్స్ చేస్తారేమో చూడాలి అంటున్నారు అభిమానులు.
Hello The Unstoppable fans of PSPK and NBK,
Power Teaser from “The Baap Of All Talk Shows” is dropping at 8pm today!Get ready…@PawanKalyan #PawanKalyanOnAHA #UnstoppableWithNBKS2 #NandamuriBalakrishna #NBKOnAHA pic.twitter.com/fYwcwatCl8
— ahavideoin (@ahavideoIN) January 20, 2023