Unstoppable 2: రేపే అన్‌స్టాపబుల్ ‘పవర్’ఫుల్ ఎపిసోడ్ గ్లింప్స్!

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ 2’ టాక్ షో ఇప్పటికే నెంబర్ వన్ టాక్ షోగా గుర్తింపు పొందింది. ఈ టాక్ షోకు స్టార్స్ వరుసబెట్టి వస్తుండటంతో వ్యూవర్‌షిప్ కూడా భారీగా పెరిగినట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఇక ఇటీవల ఈ టాక్ షోకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రావడంతో, ఏకంగా ఆహా యాప్ క్రాష్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అన్‌స్టాపబుల్ టాక్ షో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారేందుకు రెడీ అవుతోంది.

Unstoppable 2: రేపే అన్‌స్టాపబుల్ ‘పవర్’ఫుల్ ఎపిసోడ్ గ్లింప్స్!

Unstoppable 2 Pawan Kalyan Episode Glimpse To Be Out Tomorrow

Unstoppable 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ 2’ టాక్ షో ఇప్పటికే నెంబర్ వన్ టాక్ షోగా గుర్తింపు పొందింది. ఈ టాక్ షోకు స్టార్స్ వరుసబెట్టి వస్తుండటంతో వ్యూవర్‌షిప్ కూడా భారీగా పెరిగినట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఇక ఇటీవల ఈ టాక్ షోకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రావడంతో, ఏకంగా ఆహా యాప్ క్రాష్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అన్‌స్టాపబుల్ టాక్ షో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారేందుకు రెడీ అవుతోంది.

Unstoppable 2: అన్‌స్టాపబుల్-2 సంక్రాంతి స్పెషల్ ప్రోమో.. వీరసింహారెడ్డి టీమ్‌తో బాలయ్య సందడి మామూలుగా లేదుగా!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ టాక్ షోలో పాల్గొంటున్నట్లుగా నిర్వాహకులు ఇప్పటికే వెల్లడించారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ కూడా ముగిసింది. దీంతో పవన్ పాల్గొన్న ఎపిసోడ్‌ను ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ చేస్తారా అని యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, సంక్రాంతి కానుకగా ఈ పవర్‌ఫుల్ ఎపిసోడ్‌కు సంబంధించి ఓ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్లు ఆహా పేర్కొంది.

Unstoppable 2: పండగపూట పవన్ అన్‌స్టాపబుల్ షో.. నిజమైన పండగ అంటోన్న అభిమానులు!

పవన్ కల్యాణ్ ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియో గ్లింప్స్‌ను రేపు(జనవరి 15) ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ఆహా ప్రకటించింది. దీంతో పవన్ అభిమానులు ఆహా అంటున్నారు. ఇది కదా అసలైన పండగ ట్రీట్ అని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి పవన్ ఎపిసోడ్‌కు సంబంధించిన ఈ వీడియో గ్లింప్స్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.