Balakrishna : బాలయ్య మీద రూమర్స్ రాసే దమ్ముందా?? అన్‌స్టాపబుల్ లో బాలయ్య వ్యాఖ్యలు..

ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఫుల్ ఫన్ గా సాగింది. ఎపిసోడ్ లో శర్వానంద్ బాలకృష్ణని.. మీరు ఇప్పటిదాకా 100కి పైగా సినిమాలు చేశారు. దాదాపు ఓ 30 మంది హీరోయిన్స్ తో పని చేసి ఉంటారు. మీ మీద ఒక్క రూమర్, గాసిప్స్ కూడా లేకుండా..............

Balakrishna : బాలయ్య మీద రూమర్స్ రాసే దమ్ముందా?? అన్‌స్టాపబుల్ లో బాలయ్య వ్యాఖ్యలు..

Balakrishna comments on gossips and rumors

Balakrishna :  బాలయ్య బాబు హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ రెండో సీజన్ గ్రాండ్ గా కొనసాగుతోంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్లు పూర్తి అయ్యాయి. వీటికి భారీగా స్పందన వచ్చింది. మొదటి ఎపిసోడ్ లో చంద్రబాబు, లోకేష్ రాగా రెండో ఎపిసోడ్ లో సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ వచ్చి హంగామా చేశారు. మూడో ఎపిసోడ్ లో యువ హీరోలు శర్వానంద్, అడివి శేష్ అన్‌స్టాపబుల్ షోకి వచ్చి సందడి చేశారు.

ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఫుల్ ఫన్ గా సాగింది. ఎపిసోడ్ లో శర్వానంద్ బాలకృష్ణని.. మీరు ఇప్పటిదాకా 100కి పైగా సినిమాలు చేశారు. దాదాపు ఓ 30 మంది హీరోయిన్స్ తో పని చేసి ఉంటారు. మీ మీద ఒక్క రూమర్, గాసిప్స్ కూడా లేకుండా ఇన్ని ఏళ్ళు ఎలా మైంటైన్ చేశారు? మాకు కూడా ఆ సీక్రెట్ చెప్పొచ్చుగా అని అడిగాడు.

Priyanka Chopra : రిగ్గింగ్ చేసి ప్రియాంక చోప్రాని మిస్ వరల్డ్ చేశారు.. మాజీ మిస్ బార్బడోస్ లీలానీ మెక్‌కానీ సంచలన వ్యాఖ్యలు.

దీనికి బాలయ్య సమాధానమిస్తూ.. అసలు బాలయ్య మీద రూమర్స్ రాసే దమ్ముందా? ఎవరూ రాయరు. అయినా మనం అందరితో మంచిగా ఉంటాం, ముఖ్యంగా పాత్రికేయులతో మన అని ఉంటాం కాబట్టి మన మీద అలాంటి గాసిప్స్ ఎవరూ రాయరు అని తెలిపారు.