Balakrishna : అబ్బాయి డైరెక్టర్‌కి ఛాన్స్ ఇచ్చిన బాబాయ్?

కల్యాణ్ రామ్ తో బింబిసార సినిమా చేస్తున్న డైరెక్టర్ వశిష్ట మల్లిడి డైరెక్షన్లో బాలకృష్ణ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అని తెలుస్తుంది. గీతాఆర్ట్స్ బ్యానర్ వశిష్టకు అడ్వాన్స్ ఇచ్చి బాలకృష్ణతో...........

Balakrishna : అబ్బాయి డైరెక్టర్‌కి ఛాన్స్ ఇచ్చిన బాబాయ్?

Balakrishna

Balakrishna :  బాలయ్య నిజంగానే బ్రేకుల్లేని బుల్డోజరే. స్టోరీ నచ్చితే చాలు ఏ జానర్ అయినా చెయ్యడానికి రెడీ అయిపోతారు. సోకాల్డ్ కమర్షియల్ రూల్స్ బ్రేక్ చేసి సీనియర్లు, జూనియర్లు అన్న తేడాలేకుండా ఏ డైరెక్టర్ తో అయినా సినిమా చెయ్యడానికి రెడీగాఉంటారు. ఇప్పటికే గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి లాంటి యంగ్ డైరెక్టర్ లతో సినిమాలు చేస్తున్న బాలకృష్ణ అసలు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాని డైరెక్టర్ కి ఛాన్సిచ్చారు అని సమాచారం.

బాలకృష్ణ అంతే ఏం చేసినా ఫుల్ స్పీడే. కథ నచ్చితే చాలు వెంటనే ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చెయ్యడమే. ఇప్పుడు ఇదే స్పీడ్ లో మరో సినిమాకి ఓకే చెప్పేశారు. కల్యాణ్ రామ్ తో బింబిసార సినిమా చేస్తున్న డైరెక్టర్ వశిష్ట మల్లిడి డైరెక్షన్లో బాలకృష్ణ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అని తెలుస్తుంది. గీతాఆర్ట్స్ బ్యానర్ వశిష్టకు అడ్వాన్స్ ఇచ్చి బాలకృష్ణతో సినిమా లాక్ చేసేసుకుంది. అసలు ఒక్క సినిమా కూడా ఇంకా ధియేటర్లోకి రాకుండానే బాలకృష్ణ వశిష్టకు ఛాన్స్ ఇవ్వడంతో టాలీవుడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.

Tapsee Pannu : ఫిలింఫేర్ కోసం తాప్సీ స్పెషల్ ఫొటోషూట్

ప్రస్తుతం వశిష్ట మల్లిడి డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసార సినిమా త్వరలో రిలీజ్ అవ్వనుంది. ఇటీవల వచ్చిన ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా మూడు పార్టులుగా తీయనున్నారని ప్రకటించారు. కళ్యాణ్ రామ్ ని ఇందులో కొత్తగా చూపించిన ఈ యంగ్ డైరెక్టర్ టాలెంట్ కి, వశిష్ట మేకింగ్, టేకింగ్ కి బాలయ్య కూడా ఇంప్రెస్ అయ్యి సినిమాకి ఓకే చెప్పేశారు. గీతా ఆర్ట్స్ కూడా బాలయ్యతో గతంలో సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వశిష్ట మల్లిడి డైరెక్షన్ లో బాలకృష్ణ సినిమా గీతా ఆర్ట్స్ నిర్మించబోతుందని టాలీవుడ్ వర్గాల సమాచారం.