Veera Simha Reddy Trailer: వీరసింహారెడ్డి ట్రైలర్.. బాలయ్య మార్క్ మాస్.. ఒంటి చేత్తో ఊచకోత!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్‌కు రెడీ అయ్యింది. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా పూర్తి ఫ్యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. ఇక ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకను ఒంగోలులో నిర్వహిస్తోంది చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది.

Veera Simha Reddy Trailer: వీరసింహారెడ్డి ట్రైలర్.. బాలయ్య మార్క్ మాస్.. ఒంటి చేత్తో ఊచకోత!

Balakrishna Goes Powerful With Veera Simha Reddy Trailer

Updated On : January 6, 2023 / 8:55 PM IST

Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘వీరసింహారెడ్డి’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్‌కు రెడీ అయ్యింది. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా పూర్తి ఫ్యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. ఇక ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకను ఒంగోలులో నిర్వహిస్తోంది చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది.

Veera Simha Reddy : వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వారిని రావోదంటూ హెచ్చరిక..

వీరసింహారెడ్డి ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో.. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ ట్రైలర్‌ను కట్ చేశారు చిత్ర యూనిట్. ఈ ట్రైలర్‌లో బాలయ్య రెండు విభిన్నమైన గెటప్స్‌లో సందడి చేయగా, పవర్‌ఫుల్ ఫ్యాక్షన్ లీడర్‌గా బాలయ్య లుక్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఆయన నోటివెంట పవర్‌ఫుల్ డైలాగులు పేలాయి. ‘‘నాది ఫ్యాక్షన్ కాదు.. సీమ మీద ఎఫెక్షన్… పుట్టింది పులిచర్ల, చదివింది అనంతపురం, రూలింగ్ కర్నూల్.. అప్పాయింట్మెంట్ లేకుండా వస్తే.. అకేషన్ చూడను.. లొకేషన్ చూడను… ఒంటి చేత్తో ఊచకోత.. కోస్తా నా కొడకా..’’ వంటి డైలాగులను మరింత పవర్‌ఫుల్‌గా చెప్పుకొచ్చాడు బాలయ్య.

Veera Simha Reddy: వీరసింహుడి ఉగ్రరూపం.. ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్!

ఇక ఈ సినిమాలో ఏపీ పాలిటిక్స్‌పై బాలయ్య తనదైన స్టయిల్‌లో ఓ డైలాగ్ విసిరాడు. ‘సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర సృష్టించినవాడి పేరు మారదు.. మార్చలేరు..’’ అంటూ చెలరేగిపోయాడు బాలయ్య. ఇలా చాలా పవర్‌ఫుల్ డైలాగులతో బాలయ్య అభిమానులకు అదిరిపోయే మాస్ ట్రీట్ అందించాడు. ఇక ఈ సినిమాలో దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్‌లు నెగెటివ్ పాత్రల్లో తమదైన పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. శ్రుతి హాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతుందని తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాతో బాలయ్య మరోసారి బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు.