Balakrishna : మాఘమాసం లగ్గం పెట్టిస్తా.. మరోసారి గొంతు సవరించిన బాలయ్య!

మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నందమూరి నటసింహ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘వీరసింహారెడ్డి’. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ గా వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల ఊచకోత కొస్తుంది. కాగా ఈ సినిమా విజయోత్సవం సెలబ్రేషన్స్ నిన్న ఘనంగా జరిగాయి. ఇక ఈ ఈవెంట్ లో బాలకృష్ణ మరోసారి తన గొంతుని సవరించి..

Balakrishna : మాఘమాసం లగ్గం పెట్టిస్తా.. మరోసారి గొంతు సవరించిన బాలయ్య!

Balakrishna

Balakrishna : మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నందమూరి నటసింహ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘వీరసింహారెడ్డి’. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ గా వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల ఊచకోత కొస్తుంది. అఖండ సినిమా తరువాత ఈ చిత్రంతో మరోసారి 100 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టాడు బాలయ్య. అంతేకాదు ఈ మూవీ బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచి బాలయ్యకి మర్చిపోలేని సినిమాగా మిగిలిపోయింది. కాగా నిన్న హైదరాబాద్ జేఆర్‌సీ కన్వేషన్ హాల్ లో వీరసింహుని విజయోత్సవం సెలబ్రేషన్స్ నిర్వహించారు మూవీ మేకర్స్.

NBK108 : రాయలసీమ కాదు తెలంగాణ కథతో NBK108.. అనిల్ రావిపూడి!

ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు టాలీవుడ్ యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, హను రాఘవపూడి, శివ నిర్వాణ ముఖ్య అథిలుగా హాజయ్యారు. ఇక ఈ ఈవెంట్ లో బాలకృష్ణ మరోసారి తన గొంతుని సవరించి అభిమానులను ఉత్సాహ పరిచాడు. బాలయ్య నటించిన సూపర్ హిట్టు సినిమా ‘మాతో పెట్టుకోకు’ సినిమాలోని ‘మాఘమాసం లగ్గం పెట్టిస్తా’ అనే పాట పాడి అభిమానులను ఉరూతలూగించాడు. ఇందుకు సంబంధించిన వీడియోని మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేయగా ప్రస్తుతం ఇది సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

గతంలో కూడా బాలకృష్ణ ఇలా స్టేజి పై పాట పాడి సందడి చేసిన సంగతి తెలిసిందే. కాగా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపు రూ.110 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తుంది. మొత్తంగా ఈ చిత్రం సుమారు రూ.70 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ సాధించి బ్రేక్ ఈవెన్ అయ్యినట్లు సమాచారం. అయితే దీని పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సొంత డిస్ట్రిబ్యూషన్ తో రిలీజ్ చేయడంతో నిర్మాతలు భారీ లాభాలను చూసే అవకాశం ఉంది అంటున్నారు సినిమా పండితులు.