Balakrishna: అనిల్ కోసం బాలయ్య పూర్తిగా మారిపోతాడా..?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన కెరీర్‌లోని 107వ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య....

Balakrishna: అనిల్ కోసం బాలయ్య పూర్తిగా మారిపోతాడా..?

Balakrishna To Be Shown In New Getup For Anil Ravipudi Movie

Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన కెరీర్‌లోని 107వ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య సరికొత్త లుక్‌లో మనకు కనిపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాతో బాలయ్య మరోసారి బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Balakrishna: బాలయ్య నామజపం చేస్తున్న రామ్..?

అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే, బాలయ్య తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడట. మరో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ కామెడీ ఎంటర్‌టైనర్ డ్రామా మూవీలో బాలయ్య నటించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయట. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీలా తండ్రి పాత్రలో బాలయ్య నటిస్తున్నట్లు చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి వెల్లడించారు. దీంతో ఈ సినిమాలో ఆయన ముసలి పాత్రలో కనిపిస్తాడని అందరూ అనుకుంటున్నారు.

Balakrishna: బాలయ్య కోసం హీరోయిన్‌ను ఫిక్స్ చేసిన అనిల్..?

కానీ.. అనిల్ రావిపూడి మాత్రం బాలయ్యను ఇదివరకు చూడని విధంగా తాను చూపిస్తానంటూ చెబుతున్నాడు. ఈసారి బాలయ్య కొత్త లుక్ ప్రేక్షకులను షాక్‌కు గురిచేయడం ఖాయమని ఆయన అంటున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండబోతుందని, ఈ సినిమాలో ఆయన రెండు వైవిధ్యమైన పాత్రల్లో మనకు కనిపిస్తారని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ అంజలి పాత్ర అందరికీ షాకిస్తుందని చిత్ర యూనిట్ అంటోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.