Balakrishna: మైఖేల్ ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్న వీరసింహారెడ్డి

నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా వంద కోట్ల వసూళ్లతో దుమ్ములేపడంతో బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమాను అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Balakrishna: మైఖేల్ ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్న వీరసింహారెడ్డి

Balakrishna: నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా వంద కోట్ల వసూళ్లతో దుమ్ములేపడంతో బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమాను అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Balakrishna: బాక్సాఫీస్‌కు చుక్కలు చూపెడుతున్న బాలయ్య.. స్ట్రాటెజీ మామూలుగా లేదుగా!

ఇక ఈ సినిమా విజయకేతనం ఎగురవేయడంతో బాలయ్య తన నెక్ట్స్ మూవీని పట్టాలెక్కించే పనిలో బిజీగా మారాడు. కాగా, తాజాగా బాలయ్య చేతుల మీదుగా మరో యంగ్ హీరో సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మైఖేల్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు రంజిత్ జేకోడి తెరకెక్కిస్తుండగా, దివ్యాంశ కౌశిక్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి 23న బాలకృష్ణ చేతుల మీదుగా లాంచ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమాలో గౌతమ్ మీనన్, వరలక్ష్మీ శరత్ కుమార్, అనసూయ భరద్వాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, సామ్ సిఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాల మధ్య రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.