Akhanda : అమ్మవారి సన్నిధిలో ‘అఖండ’

ఇటీవల 'అఖండ' విజయం తర్వాత బాలకృష్ణ విజయోత్సవాలతో పాటు ఆలయాలని కూడా సందర్శిస్తున్నారు. ఇటీవల సింహాచలం అప్పన్న స్వామి వారి ఆలయాన్ని సందర్శిన బాలకృష్ణ తాజాగా విజయవాడ కనకదుర్గ.......

Akhanda : అమ్మవారి సన్నిధిలో ‘అఖండ’

Balayya

 

Akhanda :  బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో మూడో సినిమాగా వచ్చిన ‘అఖండ’ భారీ విజయం సాధించడంతో హ్యాట్రిక్ కొట్టారు. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసి మరింత దూసుకుపోతుంది. సినిమా రిలీజ్ అయి 2 వారాలు అవుతున్నా ఇంకా ‘అఖండ’ సినిమాకి జనాలు వస్తూనే ఉన్నారంటే బాలయ్య మానియా అలాంటిది. బాలయ్య ఉగ్ర రూపం, బోయపాటి మాస్ టేకింగ్, తమన్ మ్యూజిక్, ఫైట్ సీన్స్ ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యాయి. దేశ విదేశాల్లోనూ అఖండ భారీ విజయం సాధించింది.

Vicky-Katrina : పెళ్లి తర్వాత మొదటిసారి మీడియాకి చిక్కిన బాలీవుడ్ కొత్తజంట

ఇటీవల ‘అఖండ’ విజయం తర్వాత బాలకృష్ణ విజయోత్సవాలతో పాటు ఆలయాలని కూడా సందర్శిస్తున్నారు. ఇటీవల సింహాచలం అప్పన్న స్వామి వారి ఆలయాన్ని సందర్శిన బాలకృష్ణ తాజాగా విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని సందర్శించారు. ఇవాళ ఉదయం హీరో నందమూరి బాలకృష్ణ తో పాటు అఖండ సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. దుర్గ గుడి అధికారులు బాలకృష్ణకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు బాలయ్య. ఆ తర్వాత బాలకృష్ణకు అమ్మవారి చిత్రపటంతో పాటు వేద ఆశీర్వచనం అందించారు అర్చకులు.