Balakrishna : వరలక్ష్మి శరత్ కుమార్‌తో కలిసి పల్నాటి యుద్ధం సినిమా చేస్తానన్న బాలయ్య..

అన్‌స్టాపబుల్ షోకి వచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్ ని అభినందిస్తూ బాలకృష్ణ.. నీలాంటి మంచి యాక్టర్స్ దొరకడం అరుదు. మనం పల్నాటి యుద్ధం సినిమా చేద్దాం. అందులో నేను తాండ్ర పాపారాయుడు, నువ్వు నాయకురాలు నాగమ్మ క్యారెక్టర్ చేద్దువు. మరింత పోటాపోటీగా...................

Balakrishna : వరలక్ష్మి శరత్ కుమార్‌తో కలిసి పల్నాటి యుద్ధం సినిమా చేస్తానన్న బాలయ్య..

Balakrishna wants to do palnati yuddam movie with varalaxmi sarath kumar

Balakrishna :  బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ఆహా అన్‌స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీజన్ 2 ఆహా ఓటీటీలో సాగుతుంది. ఇటీవలే ప్రభాస్, గోపీచంద్ తో కలిసి బాహుబలి ఎపిసోడ్స్ అంటూ రెండు ఎపిసోడ్స్ ని స్ట్రీమ్ చేయగా వీటికి బాగా రెస్పాండ్ వచ్చింది. ఇక ఇప్పటికే పలు ఎపిసోడ్స్ అవ్వగా తాజాగా వీరసింహారెడ్డి చిత్రయూనిట్ అన్‌స్టాపబుల్ షోకి వచ్చి సందడి చేశారు.

ఈ సంక్రాంతికి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే వీరసింహారెడ్డి సినిమా యూనిట్ అన్‌స్టాపబుల్ షోకి వచ్చారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని, వరలక్ష్మి శరత్ కుమార్, హానీ రోజ్, రచయిత సాయి మాధవ్ బుర్రా, నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్ షోకి వచ్చి బాలయ్యతో కలిసి పండగ ఎపిసోడ్ ని మరింత సందడిగా చేశారు.

వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టినా ఇప్పుడు విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతుంది. తెలుగులో మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. గతంలో క్రాక్ సినిమాలో విలన్ గా మెప్పించిన వరలక్ష్మి ఇప్పుడు వీరసింహారెడ్డి సినిమాలో కూడా విలన్ గా, మంచిదానిగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందుతుంది. ఈ నేపథ్యంలో అన్‌స్టాపబుల్ షోకి వచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్ ని అభినందిస్తూ బాలకృష్ణ.. నీలాంటి మంచి యాక్టర్స్ దొరకడం అరుదు. మనం పల్నాటి యుద్ధం సినిమా చేద్దాం. అందులో నేను తాండ్ర పాపారాయుడు, నువ్వు నాయకురాలు నాగమ్మ క్యారెక్టర్ చేద్దువు. మరింత పోటాపోటీగా ఉంటుంది అన్నారు.

Balakrishna : బాలయ్య క్షమాపణలు చెప్పాలి.. ఏపీ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్!

అలాగే హీరోయిన్ గా చేస్తూ ఇప్పుడు విలన్ గా ఎందుకు చేస్తున్నావు అని అడగగా.. ఆ అవకాశాలు వచ్చాయి. నటిగా ప్రూవ్ చేసుకోవాలంటే ఇవే మంచివి. ఇక నాకు అందరూ విలన్ అవకాశాలే ఇస్తున్నారు. డైరెక్టర్ గోపీచంద్ ని కూడా రోజు తిడతాను క్రాక్ లో విలన్ క్యారెక్టర్ ఇచ్చావు. ఇందులో కూడా అదే క్యారెక్టర్ ఇచ్చావు అంటూ తిడతాను అని తెలిపింది. అయితే బాలయ్య.. నేను హీరోగా, నువ్వు హీరోయిన్ గా భవిష్యత్తులో ఒక సినిమా చేద్దాం అన్నారు. దానికి వరలక్ష్మి కూడా ఓకే చెప్పింది.