MAA Election: బ్యాలెట్ పేపర్ VS ఈవీఎం.. ‘మా’లో ఎందుకీ రచ్చ?

తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు ఇప్పుడు సినీ పరిశ్రమలో కాకరేపుతున్నాయి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు అక్టోబరు 10వ తేదీన జరగబోతున్నాయి. ఇప్పటికే మా ఎన్నికల..

MAA Election: బ్యాలెట్ పేపర్ VS ఈవీఎం.. ‘మా’లో ఎందుకీ రచ్చ?

Maa Ballet

MAA Election: తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు ఇప్పుడు సినీ పరిశ్రమలో కాకరేపుతున్నాయి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు అక్టోబరు 10వ తేదీన జరగబోతున్నాయి. ఇప్పటికే మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ అభ్యర్థుల లిస్ట్‌ను విడుదల చేయగా ప్రధానంగా మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ మధ్య పోటీ ఏర్పడింది. ఇప్పటికే ఎవరికి వారు మీడియా మీట్లు, ఛానెళ్లలో ఇంటర్వ్యూలో ఎవరి వర్గంలో వాళ్ళు ఓట్ల వేటలో ఓటర్లకు ఫోన్లు ఇలా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు గెలుపు వేటలో ఉన్నారు.

MAA Elections: అభ్యర్థుల తుది జాబితా రె’ఢీ’.. ఇక సమరమే!

ఇంతవరకు బాగానే ఉన్నా.. నిన్నటి నుండి ఈ రెండు ప్యానెళ్ల మధ్య ఓ అంశం కాకరేపుతుంది. ఇది ఇండస్ట్రీని దాటి తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ప్రకాష్ రాజ్ మంచు ప్యానెల్ మీద.. మోహన్ బాబు కుటుంబం మీద కూడా తీవ్ర ఆరోపణలు చేశాడు. పోస్టల్ బ్యాలెట్ల పేరుతో అరవై ఓట్లను మంచు విష్ణు గుద్దేసుకోవాలని చూస్తున్నాడని.. అందుకు తగ్గట్లే తన మనుషులను రంగంలోకి దింపాడని ఆరోపించాడు. ఇందులో కృష్ణ, కృష్ణంరాజు లాంటి వాళ్ళ పేర్లను ప్రస్తావించిన ప్రకాష్ రాజ్ వాళ్లకి తెలిసే ఇది జరుగుతుందనే మాట్లాడారు.

Maa Elections: ప్రకాష్ VS విష్ణు.. మధ్యలో పవన్.. కాకరేపుతున్న ఎలక్షన్!

దీనికి మంచు విష్ణు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చాడు. . ప్రకాష్ రాజ్ మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. ఆయన రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ గుడ్ యాక్టర్ అని ఇవాళ అందరికీ అర్థమైందని చెప్పారు. సమయం మించిపోతుందేమోనని.. చాలా మంది తనకి ఫోన్ చేసి పోస్టల్ బ్యాలెట్ డబ్బులు ఇస్తామని.. కలెక్ట్ చేసుకోవాలని కోరారని చెప్పిన విష్ణు సింగిల్ రిసిప్ట్ తో.. లీగల్ విధానంలో డబ్బులు కట్టాం. అది ఇల్లీగల్ కాదని చెప్పుకొచ్చాడు. అయితే.. ఇక్కడే ప్రకాష్ రాజ్ వర్గం పోస్టల్ బ్యాలెట్ పేరుతో విష్ణు ఇలా పోస్టల్ ఓట్లు గుద్దుకోవాలని ప్లాన్ చేస్తున్నాడని ఆరోపించాడు.

God Father: పూరి ‘చిరు’ సాయం.. స్క్రిప్ట్‌లో మార్పులా?

అయితే, విష్ణు మాత్రం ఈవీఎంలతో ఏదైనా జరగొచ్చని పోస్టల్ బ్యాలెట్ కావాలని తానే లేఖ రాశామని.. ఇప్పుడే ఇలా ఆరోపణలు చేస్తున్న ప్రకాష్ రాజ్ ఈవీఎంలతో ఇంకెన్ని ఆరోపిస్తారోనని తప్పుబట్టారు. మొత్తంగా ఇది బ్యాలెట్ పేపర్ వర్సస్ ఈవీఎం ఓటింగ్ విధానంగా ఆరోపణలు సాగగా ఇందులో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు విష్ణు ప్యానల్ లాగేసుకుంటుందని ప్రకాష్ రాజ్ వర్గం ఆరోపిస్తుంది. అయితే.. మెంబెర్ సంతకంతోనే ఫైనల్ ఓటింగ్ జరుగుతోంది కనుక వారి ఇష్టప్రకారమేనని లెక్కించాలి. మొత్తంగా చూస్తే ఈ పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారం ఇప్పుడు మా ఎన్నికలలో చిచ్చు రేపు ఒకరిని ఒకరు వ్యక్తిగత ఆరోపణల వరకు తీసుకెళ్లింది. మరి ఎన్నికల సమయానికి ఇది ఎంతవరకు వెళ్తుందో ఏమో!