T20 World Cup-2022: టీమిండియాపై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా అడిలైడ్ ఓవల్ లో కాసేపట్లో టీమిండియా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా, టీ20 ప్రపంచ కప్ లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లో టీమిండియా రెండు మ్యాచులు (పాక్, నెదర్లాండ్స్ పై) గెలిచింది. అనంతరం దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. బంగ్లాదేశ్ తో జరుగుతోన్న ఈ మ్యాచులో గెలిస్తే భారత్ సెమీ ఫైనల్ వెళ్లే అవకాశాలు ఉంటాయి.

T20 World Cup-2022: టీమిండియాపై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

T20 World Cup-2022: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా అడిలైడ్ ఓవల్ లో కాసేపట్లో టీమిండియా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టులో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, ఆర్షదీప్ సింగ్, షమీ ఉన్నారు.

కాగా, టీ20 ప్రపంచ కప్ లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లో టీమిండియా రెండు మ్యాచులు (పాక్, నెదర్లాండ్స్ పై) గెలిచింది. అనంతరం దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. బంగ్లాదేశ్ తో జరుగుతోన్న ఈ మ్యాచులో గెలిస్తే భారత్ సెమీ ఫైనల్ వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు మూడు మ్యాచులు ఆడిన బంగ్లాదేశ్ కూడా రెండింట్లో గెలిచి, ఒకదాంట్లో ఓడిపోయింది. ఈ టోర్నమెంటులో బంగ్లాదేశ్ తో పాటు టీమిండియాకు చెరో నాలుగు పాయింట్లు ఉన్నాయి.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..