Basara: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు బయటకు రాకుండా..

బాసర ఆర్జీయూకేటీ విద్యార్థుల ఆందోళన రెండో రోజూ కొనసాగింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లలో ఎవరో ఒకరు హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామంటూ విద్యార్థులు మొండిపట్టుతో నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Basara: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు బయటకు రాకుండా..

Basara

Basara: బాసర ఆర్జీయూకేటీ విద్యార్థుల ఆందోళన రెండో రోజూ కొనసాగింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లలో ఎవరో ఒకరు హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామంటూ విద్యార్థులు మొండిపట్టుతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన ఉధృతం కాకుండా విద్యార్థులు బయటకు రాకుండా పోలీసులు బారికేడ్స్ ఏర్పాటు చేశారు.

మెయిన్ గేట్ వరకు రాకుండా బారికేడ్స్ ఏర్పాటు చేసి భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. అడుగుఅడుగునా అంక్షలు అమలు చేస్తున్నారంటూ విద్యార్థుల ఆరోపణలు గుప్పిస్తున్నారు.

విద్యార్థులతో పాటుగా ఆందోళన నిర్వహిస్తున్న తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేసి బలవంతంగా జీపులో ఎక్కించారు. ఈ క్రమంలో తల్లిదండ్రులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అరెస్టు చేసిన వారిని బాసర పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Read Also: బాసరలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు