Bengal Governor summons state election commissioner: హింసాకాండపై బెంగాల్ గవర్నర్ సమన్లు జారీ

పశ్చిమబెంగాల్ పంచాయితీ ఎన్నికల నామినేషన్ల పర్వంలో చెలరేగిన హింసాకాండపై ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్‌ ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనరుకు రాజీవ్ సిన్హాకు సమన్లు జారీ చేశారు....

Bengal Governor summons state election commissioner: హింసాకాండపై బెంగాల్ గవర్నర్ సమన్లు జారీ

Bengal Governor summons

Bengal Governor summons: పశ్చిమబెంగాల్ పంచాయితీ ఎన్నికల నామినేషన్ల పర్వంలో చెలరేగిన హింసాకాండపై ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్‌ ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనరుకు రాజీవ్ సిన్హాకు(state election commissioner) సమన్లు జారీ చేశారు. ముర్షిదాబాద్ జిల్లాలో జరిగిన హింసాకాండపై (violence over Panchayat poll nominations) కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి గవర్నర్ ఆనందబోస్ కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో బెంగాల్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ సిన్హాను గవర్నరు రాజ్ భవన్ కు పిలిపించారు.

West Bengal local train derails: ఖరగ్‌పూర్‌లో పట్టాలు తప్పిన మిడ్నాపూర్-హౌరా లోకల్ రైలు

ముర్షిదాబాద్ పట్టణంలో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపడంతో ఒక కాంగ్రెస్ కార్యకర్త మరణించాడు. దీంతో ముర్షిదాబాద్ జిల్లాలో హింసాత్మక సంఘటనలను అరికట్టడానికి తీసుకున్న చర్యలను వివరించాలని సిన్హాను గవర్నర్ కోరారు. నామినేషన్ ప్రక్రియలో గందరగోళాన్ని ఎత్తిచూపేందుకు కాంగ్రెస్, బీజేపీనేతలు వేర్వేరుగా గవర్నర్‌ను కలిశారు.జులై 8వతేదీన జరగనున్న పంచాయతీ ఎన్నికలను కేంద్ర బలగాల ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్‌కు రాసిన లేఖలో కోరారు.