Bharat Jodo Yatra: జమ్మూ కశ్మీర్లోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర.. నెక్ట్స్ ఏంటి?
సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర 14 రాష్ట్రాల్లో కొనసాగింది. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ రాష్ట్రం 14వ రాష్ట్రం. ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఇప్పటి వరకు 3,000 కిలోమీటర్లకు పైగానే నడిచారు. వాస్తవానికి రాహుల్ చేపట్టిన ఈ యాత్ర మొదటి దశ యాత్రే అని కాంగ్రెస్ వర్గాలు అంటున్నారు

Bharat Jodo Yatra entered Jammu and Kashmir
Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఎట్టకేలకు జమ్మూ కశ్మీర్లోకి ప్రవేశించింది. గురువారం సాయంత్రం నాడు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు లఖ్నాన్పూర్ నుంచి జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోకి అడుగు పెట్టారు రాహుల్ గాంధీ. సరిహద్దులో హిమాచల్ ప్రదేశ్‌కు చెందన కార్యకర్తలు రాహుల్ గాంధీకి వీడ్కోలు చెప్పగా జమ్మూ కశ్మీర్‌కు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. లఖ్నాన్పూర్ నుంచి రాజధాని శ్రీనగర్ వరకు 10 రోజుల పాటు కొనసాగి జనవరి 30తో ముగుస్తుంది. ముగింపు సభను శ్రీగనర్లోనే నిర్వహించేందుకు కాంగ్రెస్ పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తోంది.
Mumbai Marathon: ముంబై మారథాన్ పూర్తి చేసిన 80 ఏళ్ల బామ్మ
సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర 14 రాష్ట్రాల్లో కొనసాగింది. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ రాష్ట్రం 14వ రాష్ట్రం. ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఇప్పటి వరకు 3,000 కిలోమీటర్లకు పైగానే నడిచారు. వాస్తవానికి రాహుల్ చేపట్టిన ఈ యాత్ర మొదటి దశ యాత్రే అని కాంగ్రెస్ వర్గాలు అంటున్నారు. ప్రస్తుతం దక్షిణం నుంచి ఉత్తరం వరకు యాత్ర సాగగా, మరో యాత్ర పశ్చిమ నుంచి తూర్పుకు సాగుతుందని అంటున్నారు. అయితే రెండవ దశ యాత్ర రాహుల్ గాంధీ కాకుండా ప్రియాంక గాంధీ వాద్రా చేపట్టనున్నట్లు చెబుతున్నారు.
Most Valuable IT Services: ఐటీలో అమెరికాను దాటేసిన భారత్.. టాప్-10లో నాలుగు ఇండియా బ్రాండ్లే