Most Valuable IT Services: ఐటీలో అమెరికాను దాటేసిన భారత్.. టాప్-10లో నాలుగు ఇండియా బ్రాండ్లే

ఇక నాలుగో స్థానంలో అమెరికాకు చెందిన మరో ఐటీ సంస్థ ఐబీఎం నిలిచింది. ఐదో స్థానంలో ఫ్రాన్స్ దేశానికి చెందిన క్యాపెమిని ఉంది. ఆరవ స్థానంలో జపాన్‭కు చెందిన ఎన్‭టీటీ డేటా, ఏడవ స్థానంలో మళ్లీ అమెరికాకే చెందిన కాగ్నిజెంట్ ఉంది. మళ్లీ ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో భారత కంపెనీలే ఉన్నాయి. ఎనిమిదవ స్థానంలో హెచ్‭సీఎల్ టెక్, తొమ్మిదవ స్థానంలో విప్రో నిలిచాయి.

Most Valuable IT Services: ఐటీలో అమెరికాను దాటేసిన భారత్.. టాప్-10లో నాలుగు ఇండియా బ్రాండ్లే

Which are the world's 10 most valuable IT services brands?

Most Valuable IT Services: ప్రపంచంలోని అత్యంత విలువైన ఐటీ బ్రాండ్లలో భారత్ ముందజలో నిలిచింది. ఏకంగా అమెరికాను సైతం దాటేసి టాప్-10 కంపెనీల్లో 4 భారత కంపెనీ బ్రాండ్లు చోటు సంపాదించడం గమనార్హం. వాస్తవానికి మొదటి స్థానంలో అమెరికాకు చెందిన అక్సెంచర్ అనే కంపెనీయే ఉన్నప్పటికీ.. టాప్-10 జాబితాలో మాత్రం అమెరికాకు చెందిన మూడు కంపెనీలు మాత్రమే చోటు దక్కించుకున్నాయి. కానీ, భారత్ నుంచి నాలుగు కంపెనీలో ఈ జాబితాలో ఉన్నాయి. అక్సెంచర్ తర్వాత రెండవ స్థానంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఆ తర్వాత ఇన్ఫోసిస్ కంపెనీలు ఉన్నాయి. ఈ రెండు భారత కంపెనీలే.

Nitish Kumar: నాకున్నది ఆ ఒక్క ఆశ మాత్రమే.. కేసీఆర్ మీటింగ్ మరుసటి రోజు నితీశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇక నాలుగో స్థానంలో అమెరికాకు చెందిన మరో ఐటీ సంస్థ ఐబీఎం నిలిచింది. ఐదో స్థానంలో ఫ్రాన్స్ దేశానికి చెందిన క్యాపెమిని ఉంది. ఆరవ స్థానంలో జపాన్‭కు చెందిన ఎన్‭టీటీ డేటా, ఏడవ స్థానంలో మళ్లీ అమెరికాకే చెందిన కాగ్నిజెంట్ ఉంది. మళ్లీ ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో భారత కంపెనీలే ఉన్నాయి. ఎనిమిదవ స్థానంలో హెచ్‭సీఎల్ టెక్, తొమ్మిదవ స్థానంలో విప్రో నిలిచాయి. ఇక టాప్-10లో చివరి స్థానంలో జపాన్ కంపెనీ ఫుజిత్సు నిలిచింది. ఈ టాప్-10 జాబితాలో కేవలం నాలుగు దేశాలకు చెందిన దేశాలు మాత్రమే చోటు సంపాదించడం గమనార్హం.

DMK On Governor: తమిళనాడు పేరు మార్పుపై గవర్నర్ క్షమాపణ చెప్పినా వెనక్కి తగ్గని డీఎంకే

టాప్-10 జాబితాలో నాలుగు స్థానాలతో భారత్, మూడు కంపెనీలతో అమెరికా, రెండు కంపెనీలతో జపాన్, ఒక కంపెనీ ఫ్రాన్స్ ఉన్నాయి. బ్రాండ్ ఫైనాన్స్ అనే సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. ఇది తెలిపిన వివరాల ప్రకారం.. మొదటి స్థానంలో ఉన్న అక్సెంటర్ కంపెనీ విలువ 39.9 బిలియన్ డాలర్లు, టీసీఎస్ విలువ 17.2 బిలియన్ డాలర్లు, ఇన్ఫోసిస్-13.01 బిలియన్ డాలర్లు, ఐబీఎం-11.6 బిలియన్ డాలర్లు, క్యాపెమిని-9.8 బిలియన్ డాలర్లు, ఎన్‭టీటీ డేటా-8.9 బిలియన్ డాలర్లు, కాగ్నిజెంట్-8.6 బిలియన్ డాలర్లు, హెచ్‭సీఎల్ టెక్-6.5 బిలియన్ డాలర్లు, విప్రో-6.2 బిలియన్ డాలర్లు, ఫిజిత్సు-4.3 బిలియన్ డాలర్లు.