Bigg Boss 5 : బిగ్ బాస్‌లో సింహాసనం.. రసవత్తరంగా సాగుతున్న కెప్టెన్సీ టాస్క్

ఇంటిసభ్యులందరికీ ‘నియంతమాటే శాసనం’ అనే టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఈ టాస్క్ ద్వారా మిగిలిన టాస్కులని పూర్తి చేయిస్తాడు. హౌస్ లో ఒక పెద్ద సింహాసనం ఏర్పాటు చేశారు. సింహాసనంపై.......

Bigg Boss 5 :  బిగ్ బాస్‌లో సింహాసనం.. రసవత్తరంగా సాగుతున్న కెప్టెన్సీ టాస్క్

Bb5

Bigg Boss 5 :  మొన్న నామినేషన్స్ ముగియడంతో నిన్నటి నుంచి బిగ్ బాస్ లో కెప్టెన్సీ టాస్కులు నడుస్తున్నాయి. కెప్టెన్సీ టాస్క్ అంటే కంటెస్టెంట్స్ మధ్యలో కచ్చితంగా గొడవలు వస్తాయి. నిన్న కూడా కంటెస్టెంట్స్ మధ్య గొడవలు అయ్యాయి. ఈ సారి కెప్టెన్సీ టాస్కులను కొత్తగా ఇచ్చాడు బిగ్ బాస్. ఇంటిసభ్యులందరికీ ‘నియంతమాటే శాసనం’ అనే టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఈ టాస్క్ ద్వారా మిగిలిన టాస్కులని పూర్తి చేయిస్తాడు. హౌస్ లో ఒక పెద్ద సింహాసనం ఏర్పాటు చేశారు. సింహాసనంపై బజర్‌ మోగిన వెంటనే ఎవరైతే కూర్చుంటారో వాళ్లే ఆ రౌండ్‌లో నియంత గా వ్యవహరిస్తారు. బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌లను మిగిలిన ఇంటిసభ్యులు పూర్తి చేయాలి. టాస్క్‌లో చివరి రెండు స్థానాల్లో ఉన్న వాళ్లల్లో ఒకరిని సేవ్‌ చేసే అవకాశం నియంతకు ఉంటుందని బిగ్‌బాస్‌ తెలిపాడు. అలా చివరి వరకు ఎవరు ఉంటారో వాళ్ళే కెప్టెన్ అవుతారు.

Naatu Naatu : రామ్ చరణ్, ఎన్టీఆర్ ‘నాటు నాటు’ స్టెప్పుకి ఇన్ని టేక్స్ తీసుకున్నారా??

మొదటిసారి బజర్‌ మోగిన వెంటనే సింహాసనంలో సిరి కూర్చుంది. మిగిలిన ఇంటి సభ్యులకు బిగ్‌బాస్‌ ‘క్యాప్‌ అండ్‌ హుక్‌’ టాస్క్‌ ఇవ్వగా రవి-సన్నీలు చివరి రెండు స్థానాల్లో నిలిచారు. సన్నీ దగ్గర ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ ఉన్నందున రవికి అవకాశం ఇస్తున్నానంటూ అతడిని సేవ్‌ చేసింది సిరి. దీంతో సన్నీ ఎప్పటిలాగే సీరియస్ అయి వెళ్ళిపోయాడు.

Chay Sam : మొత్తానికి సమంత నాగ చైతన్యకి బర్త్‌డే విషెష్ చెప్పలేదుగా…

రెండో రౌండ్‌లో శ్రీరామ్ సింహాసనం ఎక్కి నియంత అయ్యాడు. కాలిని పైకి లేపి గోడపై ఎక్కువ ఎత్తులో చెప్పులు అతికించే టాస్క్‌ని బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌కి ఇచ్చాడు. ఈసారి చివరి రెండు స్థానాల్లో కాజల్‌-రవి నిలవగా ముందునుంచి కాజల్, శ్రీరామ్ కి పడదు కాబట్టి శ్రీరామ్‌ రవిని సేవ్‌ చేశాడు. అయితే తను ఇప్పటిదాకా కెప్టెన్‌ అవ్వలేదని, తనకి కూడా ఓ అవకాశం ఇస్తే బాగుంటుందని కాజల్ అడగగా, శ్రీరామ్ కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి సమాధానాలు చెప్పు నచ్చితే నిన్ను సేవ్ చేస్తా అన్నాడు. కాజల్ ఇందుకు ఒప్పుకుంది. శ్రీరామ్‌ అడిగిన ప్రశ్నలకు కాజల్‌ సమాధానాలు చెప్పింది. అయితే ఆమె చెప్పిన సమాధానాలు తనకు సంతృప్తినివ్వలేదని, కెప్టెన్‌ పోటీకి ఎవరైతే అర్హులని తాను భావించానో వాళ్లనే సేవ్‌ చేస్తానంటూ రవిని సేవ్ చేశాడు. దీంతో ఈ సారి కూడా కెప్టెన్‌ అయ్యే అవకాశం పోయిందని కాజల్‌ ఏడ్చింది.

Naatu Naatu : రామ్ చరణ్, ఎన్టీఆర్ ‘నాటు నాటు’ స్టెప్పుకి ఇన్ని టేక్స్ తీసుకున్నారా??

మూడోరౌండ్‌లో సింహాసనాన్ని రవి దక్కించుకోగా ఈ సారి ఇచ్చిన టాస్క్ లో చివరి రెండు స్థానాల్లో మానస్‌-షణ్ముఖ్‌ నిలవగా రవి షణ్ముఖ్‌ను సేవ్‌ చేశాడు. ఈవారం కెప్టెన్‌గా ఉన్నావు కాబట్టే షణ్ముఖ్‌ని సేవ్‌ చేస్తున్నా అని మానస్ తో చెప్పాడు.

Manchu Vishnu : ‘మా’ సభ్యులకు ఇచ్చిన హామీలు.. ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న మంచు విష్ణు

నాలుగోసారి బజర్‌ మోగగానే ప్రియాంక సింహాసనం దక్కించుకుంది. ఈ రౌండ్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ‘వాటర్‌ డ్రమ్ టాస్క్‌’ ఇవ్వగా శ్రీరామ్‌-షణ్ముఖ్‌ మిగిలారు. ఈ వారం నామినేషన్‌లో షణ్ముఖ్‌ని నేను నామినేట్‌ చేసినా తను నన్ను నామినేట్‌ చేయలేదు. అందుకే అతడిని సేవ్‌ చేస్తున్నా అని షన్ను ని సేవ్ చేసింది ప్రియాంక.

NTR : నిన్న పెద్ద కొడుకు.. ఇవాళ చిన్న కొడుకు.. ఫారిన్‌లో పిల్లలతో ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్

ఇక ఐదో రౌండ్‌లో సింహాసనం కోసం జరిగిన పోటీలో ఒకేసారి సిరి-ప్రియాంక కూర్చోవడంతో గొడవగా మారింది. కెప్టెన్ మానస్ ప్రియాంక క్లోజ్ కాబట్టి ప్రియాంకే ముందు కూర్చుంది. ఇది నా డెసిషన్ అని చెప్పాడు. దీంతో సిరి ఏడుస్తూ వెళ్ళిపోయింది. మానస్‌-సన్నీ అబద్ధాలు ఆడుతున్నారని అరిచింది. సన్నీ, కాజల్, మానస్, శ్రీరామ్ లు ఇప్పటికే ఈ వారం కెప్టెన్సీకి అర్హత కోల్పోయారు. మరి ఈ చివరి రౌండ్ లో ఇంటి సభ్యులకు బిగ్‌బాస్‌ ఎలాంటి టాస్క్‌ ఇచ్చాడు? అందులో ఎవరు విజయం సాధించారు? కెప్టెన్ ఎవరు అయ్యారు అంటే ఇవాళ్టి ఎపిసోడ్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.