Sohel Ryan : నెగిటివ్ కామెంట్స్ పెడితే ఇంటికొచ్చి మరీ కొడతా.. నా కొడకల్లారా.. స్టేజిపై రెచ్చిపోయిన సోహెల్..

లక్కీ లక్ష్మణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సోహెల్ మాట్లాడుతూ.. కొంతమంది కావాలని సినిమాలు, యూట్యూబ్ లో వీడియోల కింద నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. భూతులు తిడుతూ, ఇంట్లో వాళ్ళని కూడా తిడుతూ కొంతమంది చాలా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. వాళ్లందరికీ ఒకటే చెప్తున్నా ఇంకోసారి కామెంట్స్...........

Sohel Ryan : నెగిటివ్ కామెంట్స్ పెడితే ఇంటికొచ్చి మరీ కొడతా.. నా కొడకల్లారా.. స్టేజిపై రెచ్చిపోయిన సోహెల్..

BiggBoss Sohel sensational comments on negative comments

Sohel Ryan :  నటుడు సోహెల్ ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉంటూ పలు సినిమాల్లో నటించినా గుర్తింపు దక్కలేదు. కానీ బిగ్‌బాస్ లో పాల్గొని బాగా ఫేమ్ తెచ్చుకున్నాడు. బిగ్‌బాస్ లో విన్నర్ అవ్వకపోయినా సెకండ్ రన్నరప్ గా నిలిచి కూడా విన్నర్, రన్నరప్ కంటే కూడా బాగా ఫేమ్ తెచ్చుకున్నాడు. షోలో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి అభిమానులని సంపాదించుకున్నాడు.

ఇక బిగ్‌బాస్ నుంచి బయటకి వచ్చాక హీరోగానే పలు సినిమాలు అనౌన్స్ చేశాడు. సీనియర్ ఆర్టిస్టులు, స్టార్ డైరెక్టర్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులతో కూడా సినిమాలు చేస్తున్నాడు. హీరోగా సోహెల్ నటించిన లక్కీ లక్ష్మణ్ అనే సినిమా డిసెంబర్ 30న రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సోహెల్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో అవి వైరల్ గా మారాయి.

Sai Madhav Burra : ‘ప్రాజెక్ట్ K’ సినిమా అందరూ అనుకున్నట్టు టైం ట్రావెల్ కాదు.. సాయి మాధవ్ బుర్రా కామెంట్స్..

లక్కీ లక్ష్మణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సోహెల్ మాట్లాడుతూ.. కొంతమంది కావాలని సినిమాలు, యూట్యూబ్ లో వీడియోల కింద నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. భూతులు తిడుతూ, ఇంట్లో వాళ్ళని కూడా తిడుతూ కొంతమంది చాలా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. వాళ్లందరికీ ఒకటే చెప్తున్నా ఇంకోసారి కామెంట్స్ నెగిటివ్ గా పెడితే మీ అడ్రస్ కనుక్కొని వచ్చి మరీ కొడాతా నా కొడకల్లారా. సినిమా నచ్చితే నచ్చింది, లేకపోతే నచ్చలేదు అని చెప్పండి అంతే. ఇంట్లో వాళ్ళని, వేరే వాళ్ళని తిడితే మాత్రం ఊరుకోను, నన్నే కాదు ఏ హీరో, హీరోయిన్, సినిమా వాళ్ళనెవర్ని తిట్టినా ఇంటికొచ్చి కొడతాను. మీకేం తెలుసురా మా కష్టాలు, ఇక్కడ కోట్లు పోసి సినిమాలు తీస్తుంటే అంటూ ఆవేశంగా రెచ్చిపోయి మాట్లాడాడు. దీంతో సోహెల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు.