Sai Madhav Burra : ‘ప్రాజెక్ట్ K’ సినిమా అందరూ అనుకున్నట్టు టైం ట్రావెల్ కాదు.. సాయి మాధవ్ బుర్రా కామెంట్స్..

ప్రస్తుతం హరిహర వీరమల్లు, శాకుంతలం, రామ్ చరణ్-శంకర్ సినిమాలతో పాటు మరిన్ని సినిమాలకి మాటలు రాస్తున్నాను. ప్రభాస్ ప్రాజెక్ట్ K సినిమాకి కూడా వర్క్ చేస్తున్నాను. అందరూ అనుకున్నట్టు ప్రాజెక్ట్ K టైం ట్రావెల్ సినిమా...............

Sai Madhav Burra : ‘ప్రాజెక్ట్ K’ సినిమా అందరూ అనుకున్నట్టు టైం ట్రావెల్ కాదు.. సాయి మాధవ్ బుర్రా కామెంట్స్..

Sai Madhav Burra interesting comments on Prabhas Project K movie

Updated On : December 31, 2022 / 9:00 AM IST

Sai Madhav Burra :  ప్రముఖ రచయిత సాయిమాధవ్ బురాప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ రైటర్ గా కొనసాగుతున్నారు. చాలా వరకు స్టార్ హీరోల సినిమాలకి సాయి మాధవ్ బుర్రానే రచయితగా ఉంటున్నారు. త్వరలో సంక్రాంతికి రిలీజయ్యే బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాకి కూడా మాటలు, పదునైన డైలాగ్స్ ఈయనే రాస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరసింహారెడ్డి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సినిమాల గురించి మాట్లాడారు సాయి మాధవ్ బుర్రా.

సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ.. బాలకృష్ణ వీరసింహా రెడ్డి సినిమాకి రాయడానికి నాకు రెండు నెలలు పట్టింది. ఇది యాక్షన్ మాత్రమే కాదు ఎమోషన్స్, లవ్.. అన్ని అంశాలు ఉన్న సినిమా. మరో కొత్త అంశం కూడా ఇందులో దాగుంది. బాలకృష్ణ గారు ఒకసారి స్క్రిప్ట్ ఫైనల్ అయ్యాక దాంట్లో వేలు పెట్టరు. ఆయనతో నాకు ఇది నాలుగో సినిమా. దర్శకుడు గోపీచంద్ తో నాకు రెండో సినిమా. గోపీచంద్ భవిష్యత్తులో మరింత పెద్ద డైరెక్టర్ అవుతాడు.

Dil Raju : పవన్ కళ్యణ్, మహేష్ బాబు సినిమాలతో చాలా నష్టపోయాను.. ఇంకొకరైతే సూసైడ్ చేసుకునేవారు..

ప్రస్తుతం హరిహర వీరమల్లు, శాకుంతలం, రామ్ చరణ్-శంకర్ సినిమాలతో పాటు మరిన్ని సినిమాలకి మాటలు రాస్తున్నాను. ప్రభాస్ ప్రాజెక్ట్ K సినిమాకి కూడా వర్క్ చేస్తున్నాను. అందరూ అనుకున్నట్టు ప్రాజెక్ట్ K టైం ట్రావెల్ సినిమా అయితే కాదు. ఇది చాలా కొత్త జోనర్ లో సాగే సినిమా. అందరికి కొత్తగా ఉండటమే కాదు బాగా నచ్చుతుంది అని తెలిపారు. దీంతో బుర్రా సాయి మాధవ్ చేసిన కామెంట్స్ వైరల్ అవ్వడంతో ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎంతో ఆతృతగా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.