Dil Raju : పవన్ కళ్యణ్, మహేష్ బాబు సినిమాలతో చాలా నష్టపోయాను.. ఇంకొకరైతే సూసైడ్ చేసుకునేవారు..

డిస్ట్రిబ్యూషన్ రంగం నుంచి నిర్మాతగా ఎదిగి ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. అయినా పలు సినిమాలని డిస్ట్రిబ్యూట్ చేస్తూ మరింత సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో హిట్ సినిమాలే కాదు అనుకోకుండా కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా రిలీజ్ చేసి భారీగా నష్టపోయారు. దీనిపై దిల్ రాజు స్పందిస్తూ............

Dil Raju : పవన్ కళ్యణ్, మహేష్ బాబు సినిమాలతో చాలా నష్టపోయాను.. ఇంకొకరైతే సూసైడ్ చేసుకునేవారు..

Dil Raju comments on his distribution losses

Updated On : June 1, 2023 / 5:56 PM IST

Dil Raju :  కొన్ని రోజులుగా దిల్ రాజు టాలీవుడ్ లోనే కాదు సోషల్ మీడియాలో కూడా బాగా ట్రెండ్ లో ఉంటున్నారు. సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ లాంటి ఇద్దరు స్టార్ హీరోల మధ్య తన డబ్బింగ్ సినిమా వారసుడుని రిలీజ్ చేస్తూ వివాదాల్లో కూడా ఉంటున్నారు. ఇక ఇటీవల వారసుడు ప్రమోషన్స్ కి స్వయంగా తనే రంగంలోకి దిగి ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన కామెంట్స్ చేస్తూ మరింత ట్రెండ్ అవుతున్నారు.

దిల్ రాజు చేసే కామెంట్స్ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ట్రోలర్స్ కూడా దిల్ రాజుని గట్టిగానే ఆడేసుకుంటున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

డిస్ట్రిబ్యూషన్ రంగం నుంచి నిర్మాతగా ఎదిగి ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. అయినా పలు సినిమాలని డిస్ట్రిబ్యూట్ చేస్తూ మరింత సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో హిట్ సినిమాలే కాదు అనుకోకుండా కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా రిలీజ్ చేసి భారీగా నష్టపోయారు. దీనిపై దిల్ రాజు స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ సినిమా అజ్ఞాత వాసి, మహేష్ బాబు స్పైడర్ సినిమాలు ఒకే సంవత్సరం రిలీజయ్యాయి. ఆ రెండు సినిమాలు డిస్ట్రిబ్యూషన్ నేనే తీసుకున్నాను. వాటితో భారీగా నష్టం వచ్చింది. ఈ రెండు సినిమాలు ఇచ్చిన నష్టాలతో ఇంకొకరైతే సూసైడ్ చేసుకునేవారు. నేను కాబట్టి తట్టుకున్నాను. అయితే అదే సంవత్సరం నేను డిస్ట్రిబ్యూట్ చేసిన కొన్ని సినిమాలు హిట్ అవ్వడంతో కొంతమేరకు ఆ నష్టాల నుంచి బయటపడగలిగాను అని అన్నారు. దీంతో దిల్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Samantha : మనం చేయగలిగే లక్ష్యాలనే పెట్టుకోవాలి.. చాలా రోజుల తర్వాత తన ఫొటోతో సమంత పోస్ట్..

అయితే ఈ సంవత్సరం లైగర్, ఆచార్య సినిమాలని డిస్ట్రిబ్యూట్ చేసి వరంగల్ శ్రీను భారీగా నష్టపోయాడు. దిల్ రాజు చెప్పిన రెండు సినిమాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అమౌంట్. దీంతో వరంగల్ శ్రీనుని కంపేర్ చేస్తూ దిల్ రాజుని సోషల్ మీడియాలో మరోసారి ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.