BJP Saral App Launches in telangana : అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా బీజేపీ ‘సరళ్ యాప్’ లాంచింగ్..తెలంగాణాలోని 34,867 బూత్‌లు యాప్‌లో అనుసంధానం

అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా బీజేపీ ‘సరళ్ యాప్’ లాంచింగ్ చేసింది. తెలంగాణాలోని 34,867 బూత్‌లు యాప్‌లో అనుసంధానం.

BJP Saral App Launches in telangana : అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా బీజేపీ ‘సరళ్ యాప్’ లాంచింగ్..తెలంగాణాలోని 34,867 బూత్‌లు యాప్‌లో అనుసంధానం

bjp launches saral app in telangana

Updated On : May 26, 2023 / 11:50 AM IST

bjp launches saral app in telangana : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా బీజేపీ పక్కాగా వ్యూహాలు రచిస్తోంది. ఢిల్లీ పెద్దలు సైతం తెలంగాణాలో అధికారం సాధించటానికి తరచు రాష్ట్రంలో సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో తనకున్న సీట్లను పెంచుకుంటూనే మరోపక్క అధికారం కోసం నేతలు కృషి చేస్తున్నారు. దీంట్లో భాగంగానే ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో అవలంభించిన విధానాలతోనే తెలంగాణలో పాటించాలని భావిస్తోంది. దీంట్లో భాగంగనే గుజరాత్, యూపీ, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో డిజిటల్ దూకుడుతో సక్సెస్ సాధించిన బీజేపీ తెలంగాణలో కూడా అదే డిజిటల్ తో విజయం సాధించాలనుకుంటోంది.

బెంగాల్ లో తృణముల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఆ రాష్ట్రంలో గతం కంటే ఎక్కువ సీట్లు గెలుసుకుంది బీజేపీ అది కూడా ఈ సరళ్ యాప్ విధానంతోనే ఓటు బ్యాంకును పెంచుకుంది. ఇప్పుడు అదే వ్యూహాన్ని తెలంగాణలోకూడా అమలు చేయాలనుకుంటోంది. దీంట్లో భాగంగానే తెలంగాణలో సరళ్ యాప్ ను విడుదలు చేసింది బీజేపీ అధిష్టానం. బూత్ కమిటీ సభ్యుడు నుంచి జాతీయ అధ్యక్షుడి వరకు సరళ్ యాప్ తో అనుసంధానం ఉంటుంది.

ఈక్రమంలో తెలంగాణలో సరళ్ యాప్ సమ్మేళనాలు చేపట్టింది బీజేపీ. తెలంగాణాలోని 34,867 బూత్ లు ఈ సరళ్ యాప్ లో అనుసంధానం చేయబడ్డాయి. మొత్తం 119 నియోజకవర్గాల్లో వర్చువల్ గా బీజేపీ బూత్ స్థాయి సమ్మేళనాలను ప్రారంభించింది. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కమిటీ సభ్యులను ఉద్ధేశించి ప్రసంగించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా ఈ సరళ్ యాప్ లను బీజేపీ అధిష్టానం విడుదుల చేసింది.

ఏంటీ సరళ్ యాప్‌..?
ఈ యాప్ విష‌యానికి వ‌స్తే.. S- సంఘటన్‌, R- రిపోర్టింగ్‌, A- అనాలసిస్‌ L- లీడ్‌(SARAL)’గా బీజేపీ నేత‌లు చెబుతున్నారు. ‘సంఘటన్‌ మహా విస్తార్‌’ అభియాన్‌లో భాగంగా పార్టీ విధానాలు, కార్యక్రమాలను కార్యకర్తలందరికీ చేరవేయాలనే లక్ష్యంతో ఈ యాప్‌ను రూపొందించారు. రాష్ట్రంలో మొత్తం 6,973 శక్తి కేంద్రాలు, 34,867 బూత్‌లు ఉన్నాయి. సరళ్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి ఇప్పటికే ఎంపిక చేసిన కార్యకర్తలకు క్యూఆర్‌ కోడ్‌ పంపించారు. పార్టీ శ్రేణులు, అభిమానులు ఈ యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. లేదా 6359119119 నంబరుకు మిస్డ్‌ కాల్‌ ఇవ్వొచ్చు. ఈ యాప్‌లో దేశవ్యాప్తంగా ఉన్న బూత్‌లు, శక్తి కేంద్రాలు, జిల్లాలు, మండలాలు, విభాగాలు, రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం మొతాన్ని పొందుపరిచారు.

ఇది సోషల్‌ మీడియాకు కూడా అనుసంధానమై ఉంటుంది.బీజేపీ అధిష్ఠానం నిర్వహించబోయే కార్యక్రమాలు, దేశంలో పార్టీ ప్రముఖుల రోజువారీ కార్యక్రమాల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. ఇప్పటికే గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో సరళ్‌ యాప్‌ను వినియోగించుకొని మంచి ఫలితాలు సాధించామని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే జోష్ తో బీజేపీ తెలంగాణలో కూడా అధికారంలోకి రావటానికి ఈ సరళ్ యాప్ విధానాన్ని అమలు చేస్తోంది.