Saindhav: వెంకీ ల్యాండ్‌మార్క్ మూవీ ‘సైంధవ్’లో బాలీవుడ్ యాక్టర్.. ఎవరంటే..?

టాలీవుడ్‌లో హిట్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే గుర్తింపు, సక్సెస్‌ను అందుకున్నాడు యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను. ఈ దర్శకుడు ప్రస్తుతం తన హిట్ వర్స్‌లో మూడో భాగమైన హిట్-3 చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా కంటే ముందు, మరో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‌తో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు గతంలోనే వెల్లడించాడు.

Saindhav: వెంకీ ల్యాండ్‌మార్క్ మూవీ ‘సైంధవ్’లో బాలీవుడ్ యాక్టర్.. ఎవరంటే..?

Bollywood Actor Nawazuddin Siddiqui In Venkatesh's Saindhav Movie

Saindhav: టాలీవుడ్‌లో హిట్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే గుర్తింపు, సక్సెస్‌ను అందుకున్నాడు యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను. ఈ దర్శకుడు ప్రస్తుతం తన హిట్ వర్స్‌లో మూడో భాగమైన హిట్-3 చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా కంటే ముందు, మరో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‌తో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు గతంలోనే వెల్లడించాడు.

Saindhav : పాన్ ఇండియా లెవెల్‌లో వెంకీ మామ ల్యాండ్ మార్క్ మూవీ.. టైటిల్ గ్లింప్స్ అదుర్స్!

ఇక ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను కూడా చిత్ర యూనిట్ చేసింది. ఈ సినిమాకు ‘సైంధవ్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేయడంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు భారీగా క్రియేట్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో వెంకటేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమాలో బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటించబోతున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

ఈ అనౌన్స్‌మెంట్‌తో ‘సైంధవ్’ మూవీపై అంచనాలు మరింతగా పెంచేశాడు దర్శకుడు శైలేష్ కొలను. ఇక ఈ సినిమా వెంకటేష్ కెరీర్‌లో 75వ చిత్రంగా వస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ ఎలాంటి పాత్రలో నటిస్తాడో తెలియాలంటే ఈ సినిమా కంప్లీట్ అయ్యి, బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.