Actor Sonu Sood : కూరలు అమ్మిన సోనూసూద్

దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న వేళ తనవంతు సాయంగా ఎందరినో ఆదుకున్నారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. ఒక ట్వీట్ తో ఆపదలో ఉన్నవారిని ఆదుకుని ఎందరికో ప్రాణం పోశారు.

Actor Sonu Sood : కూరలు అమ్మిన సోనూసూద్

Sonu Sood

Updated On : November 6, 2021 / 7:55 PM IST

Actor Sonu Sood :  దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న వేళ తనవంతు సాయంగా ఎందరినో ఆదుకున్నారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. ఒక ట్వీట్ తో ఆపదలో ఉన్నవారిని ఆదుకుని ఎందరికో ప్రాణం పోశారు.

విదేశాల్లో ఉన్నవారిని విమానాల్లో  రప్పించటం మొదలు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు, అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా చేయించారు. ఆర్ధికంగాచితికిపోయిన వ్యవసాయ కార్మికుడికి ట్రాక్టర్ బహుమతిగా ఇచ్చి తనదెంత దయార్ధ్ర హృదయమో తెలిపారు.

Also Read : Mid-day Meal : మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్ధులకు అస్వస్ధత

ఈ రోజు ఉత్తర ప్రదేశ్ లో మరో మంచి పని చేశారు. చిరు వ్యాపారులు తోపుడ బళ్లమీద వ్యాపారం చేసుకునే వారివద్ద నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలనివిజ్ఞప్తి చేశారు. అందులో భాగంగా రోడ్డుమీద తోపుడు బండిమీద కూరగాయలు అమ్ముతున్న ఇద్దరు యువకుల వద్దకు వెళ్లి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ఆ యువకులతో సంభాషిస్తూ ఒక వీడియో తీసుకుని దానిని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తాజా కూర‌గాయ‌ల‌ను ఎలా కొనాలో ఆ వీడియోలో వివ‌రించారు. అంద‌రూ చిరు వ్యాపారుల నుంచి నిత్యావ‌స‌రాలు కొనండి అంటూ విజ్ఞప్తి చేశారు. ఆ వీడియోను మీరు కూడా ఓ లుక్కేయండి.