Aishwarya Rai : పనామా పేపర్స్ కేసు.. ఈడీ ముందు హాజరైన బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్​

పన్ను ఎగవేసి విదేశాలకు నగదు తరలించారనే ఆరోపణలపై ప్రశ్నించేందుకు గతంలో ఐశ్వర్యరాయ్ ఈడీ నోటీసులు ఇచ్చింది. గతంలో సమన్లు ఇచ్చినప్పుడు ఐశ్వర్యరాయ్ సమయం కోరింది.

Aishwarya Rai : పనామా పేపర్స్ కేసు.. ఈడీ ముందు హాజరైన బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్​

Aishwarya Rai(1)

Panama Papers case : పనామా పత్రాల కేసులో బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ ఈడీ ముందు హాజరయ్యారు. ఢిల్లీ జామ్​నగర్​ హౌస్​లోని ఈడీ కార్యాలయంలో ఐశ్వర్య రాయ్ హాజరయ్యారు. విదేశీ మారకద్రవ్య నిబంధనల ఉల్లంఘన కింద ఐశ్వర్యను అధికారులు ప్రశ్నిస్తున్నారు. పన్ను ఎగవేసి విదేశాలకు నగదు తరలించారనే ఆరోపణలపై ప్రశ్నించేందుకు గతంలో ఐశ్వర్యకు ఈడీ నోటీసులు ఇచ్చింది.

గతంలో సమన్లు ఇచ్చినప్పుడు ఐశ్వర్యరాయ్ సమయం కోరింది. ఈ రోజు కూడా ఈడీ ముందు హజరు కాలేనని ఐశ్వర్యరాయ్ సమాచారం ఇచ్చారు. ఆర్బీఐ నిబంధనల మేరకు 2004 నుంచి విదేశాలకు పంపిన ధనం వివరాలు తెలపాలని గత నోటీసుల్లోనే ఈడీ పేర్కొంది.

Pankaj Chowdhury : తెలంగాణ అప్పులు 2లక్షల 37వేల కోట్లు!

ప్రపంచంలోని అత్యంత ధనికులు, శక్తిమంతమైన వ్యక్తులు పన్నులు ఎగ్గొట్టడానికి షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు నిధులు తరలించారని.. 2016లో లీకైన పనామా పత్రాల్లో వెల్లడైంది. అయితే లీకైన పనామా పత్రాల్లో ఐశ్వర్యరాయ్ సహా భారత్‌కు చెందిన ప్రముఖుల పేర్లు ఉండటం గమనార్హం.

ఈ పనామా పేపర్స్ కేసులో 500మంది ఇన్వాల్వ్ అయి ఉన్నట్లు సమాచారం. లీడర్లు, నటులు, క్రీడాకారులు, వ్యాపారస్థుల్లాంటి ప్రముఖుల పేర్లన్నీ అందులో ఉన్నాయి. ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు గానూ ప్రత్యామ్నాయాలను ఎన్నుకోవడమే దీనికి కారణం. అందులో వాస్తవాలు ఏ మేరకు ఉన్నాయోనని ఈడీ అధికారులు విచారణ జరుపుతున్నారు.

CM Aravind Kejriwal : ప్రజలు మాస్క్‌లు ధరించి కరోనా వ్యాపించకుండా నిరోధించాలి : సీఎం కేజ్రీవాల్

నెల క్రితం అభిషేక్ బచ్ఛన్ కూడా ఈ విచారణలో పాల్గొన్నారు. కొన్ని డాక్యుమెంట్లను కూడా ఆ సమయంలో సబ్ మిట్ చేశారు. త్వరలో అమితాబ్ బచ్ఛన్ కు కూడా ఈడీ నోటీసులు అందుతాయని సమాచారం.