Major : బాలీవుడ్, మలయాళం వాళ్ళు అడిగినా ఒప్పుకోలేదు.. మాకు ఓకే చేశారు..

తాజాగా ఓ ప్రమోషన్ ప్రెస్ మీట్ లో ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని తెలియచేశారు అడివి శేష్. సందీప్ బయోపిక్ తీయడానికి బాలీవుడ్, మలయాళం వాళ్ళు...................

Major : బాలీవుడ్, మలయాళం వాళ్ళు అడిగినా ఒప్పుకోలేదు.. మాకు ఓకే చేశారు..

Major Movie (1)

Mjor :  26/11 ముంబయ్‌ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్‌ ఆర్మీ ఆఫీసర్‌ మేజర్‌ సందీప్‌ కృష్ణన్‌ జీవిత కథతో తెరకెక్కిన బయోపిక్ ‘మేజర్‌’. అడివి శేష్‌ హీరోగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా శశికిరణ్‌ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్‌ ఇండియన్‌ సినిమాగా జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో గత కొద్ది రోజులుగా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్.

The warrior : రామ్ కోసం.. 150 మంది డ్యాన్సర్లు, 100 మంది మోడల్స్..

 

తాజాగా ఓ ప్రమోషన్ ప్రెస్ మీట్ లో ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని తెలియచేశారు అడివి శేష్. సందీప్ బయోపిక్ తీయడానికి బాలీవుడ్, మలయాళం వాళ్ళు కూడా ప్రయత్నించారని, వాళ్ళు వచ్చి సందీప్ పేరెంట్స్ ని సినిమా తీయడానికి పర్మిషన్ అడిగితే ఒప్పుకోలేదని తెలిపారు. ఎందుకంటే వాళ్ళు సజెస్ట్ చేసిన హీరోలు తమ కొడుకులా లేరు అని నో చెప్పారు సందీప్ పేరెంట్స్. మేము వెళ్లి వాళ్ళని పర్మిషన్ అడిగినప్పుడు, అలాగే నా టెస్ట్ లుక్ చూపించినప్పుడు మేం అప్రోచ్‌ అయిన నిజాయితీ వారికి నచ్చి, అలాగే వారి కొడుకు పోలికలకు నేను దగ్గరగా ఉన్నాను అనిపించి మాకు ఓకే చెప్పారు. ఈ సినిమా చేయడం మా అదృష్టం. మాకే ఈ సినిమా రాసిపెట్టి ఉంది. అందుకే వేరే వాళ్ళు అడిగినా మాకు ఓకే అయింది. సినిమా చూసాక సందీప్ తల్లితండ్రులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అని అడివి శేష్ తెలిపారు.