Nitin Desai : తండ్రి మరణం పై నితిన్‌ కుమార్తె వ్యాఖ్యలు.. మోసం చేసి డబ్బులు..

బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ నితిన్‌ దేశాయ్‌ ఆత్మహత్య చేసుకొని ఇటీవల మరణించిన విషయం అందరికి తెలిసిందే. తాజాగా ఆయన కుమార్తె మాన్సీ మీడియా ముందుకు వచ్చి..

Nitin Desai : తండ్రి మరణం పై నితిన్‌ కుమార్తె వ్యాఖ్యలు.. మోసం చేసి డబ్బులు..

Bollywood art director Nitin Desai daughter Mansi reaction on debts

Nitin Desai : ఇటీవల ప్రముఖ బాలీవుడ్ (Bollywood) స్టార్ ఆర్ట్ డైరెక్టర్ నితిన్‌ దేశాయ్‌ ఆత్మహత్య చేసుకొని మరణించిన విషయం అందరికి తెలిసిందే. సూసైడ్ చేసుకునే ముందు ఆయన రికార్డు చేసిన కొన్ని సెల్ఫీ వీడియోలు ద్వారా.. ఆయన మరణానికి గల కారణం అప్పులు పై ఉన్న అధిక రుణభారం అని తెలుస్తుంది. ఒక ఫైనాన్స్ సంస్థ నుంచి నితిన్‌ దేశాయ్‌ భారీ మొత్తంలో అప్పుగా పొందారని, కరోనా ముందు వరకు దానికి సక్రమంగా చెల్లిస్తూనే వచ్చారని, అయితే కోవిడ్ తరువాత అంతా మారిపోయిందని, అదే తన తండ్రి మరణానికి కారణమైందని అతని కుమార్తె తెలియజేసింది.

The Elephant Whisperers : ఆస్కార్ విన్నర్ ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ డైరెక్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బొమ్మన్ & బెల్లి.. 2 కోట్లు కోరుతూ లీగల్ నోటిస్ కూడా..

గత కొన్నిరోజులు నితిన్ దేశాయ్ పై పలు ఆర్టికల్స్ వస్తున్నాయి. వాటిపై రియాక్ట్ అవుతూ ఆయన కుమార్తె మాన్సీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. “మా నాన్న ఫైనాన్స్‌ కంపెనీ నుంచి రూ.181 కోట్లు అప్పుగా తీసుకున్నారు. అయితే దానిలో దాదాపు రూ.86.31 కోట్లను ఆల్రెడీ తిరిగి ఇచ్చేశారు. 2020 ఫిబ్రవరి వరకు క్రమం తప్పకుండా డబ్బులు చెల్లిస్తూనే వచ్చారు. ఆ తరువాత కరోనా వల్ల పరిస్థితులు మారాయి. దానివల్ల స్టూడియో మూతపడడం, ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడంతో రెగ్యులర్‌గా చెల్లించాల్సిన డబ్బుని చెల్లించలేకపోయారు. మరో విషయం ఏంటంటే.. ఒక సమయంలో ఒకేసారి 6 నెలల వడ్డీని చెల్లించమని కోరారు. అప్పుడు కూడా డబ్బు చెల్లించడానికి పొవాయిలో ఉన్న తన ఆఫీస్‌ ను అమ్మేసి కట్టారు. ఇచ్చిన మాట కోసం తీసుకున్న డబ్బుని చెల్లించడానికి ప్రయత్నించారు తప్ప ఎవర్ని మోసం చేయాలనుకోలేదు. కాబట్టి మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నా ఆయన పరువుకు నష్టం కలిగించేలా తప్పుడు కథనాలు రాయకండి” అంటూ పేర్కొన్నారు.

Bholaa Shankar : రెండేళ్లుగా భోళా శంకర్ షూటింగ్.. మొత్తం ఎన్ని రోజులు షూట్ చేశారో తెలుసా?

కాగా 1980లలో సినీ పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చిన నితిన్‌ దేశాయ్‌.. దాదాపు 100 సినిమాలకు పైగా ఆర్ట్ డైరెక్టర్ గా చేశారు. అంతేకాదు ప్రొడక్షన్ డిజైనర్ గా, నటుడిగా, దర్శకుడిగా కూడా సినిమాలు తెరకెక్కించారు. హమ్‌ దిల్‌ దే సనమ్‌, లగాన్‌, దేవదాస్‌, జోధా అక్బర్‌, ప్రేమ్‌ రతన్‌ ధన్ పాయో, 1942 ఏ లవ్‌ స్టోరీ, ఫ్యాషన్‌, పాని పట్‌, దోస్తానా.. లాంటి ఎన్నో సూపర్ హిట్ బాలీవుడ్ సినిమాలకు పని చేసి ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు.