Heroins : మరోసారి ట్రోల్ అవుతున్న బాలీవుడ్ హీరోయిన్స్..

ఈ మధ్య హీరోయిన్ల స్టైల్ స్టేట్ మెంట్స్ కాస్త అటూ ఇటూ అవుతున్నాయి. అందుకే ఏదో స్టైల్ గా ఉంటుందనో, డిఫరెంట్ గా ఉంటుందనుకునో వేసుకున్న డ్రెస్ లు డిజాస్టర్ అయ్యి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి.............

Heroins : మరోసారి ట్రోల్ అవుతున్న బాలీవుడ్ హీరోయిన్స్..

Janhvi

Heroins :  హీరోయిన్లు ఎక్కడున్నా న్యూస్ మేకర్సే. ఏం చేసినా, ఏమీ చెయ్యకపోయినా, సంప్రదాయబద్దంగా బట్టలేసుకున్నా, స్టైలిష్ గా రెడీ అయినా.. ఇలా ఏం చేసినా హెడ్ లైన్స్ లోనే ఉంటారు మన హీరోయిన్లు. అయితే ఒక్కోసారి వాళ్లు స్టైలిష్ గా వేసుకున్న బట్టలు డిజాస్టర్ అయ్యి సోషల్ మీడయాలో ట్రోలర్స్ కి దొరికిపోతారు. లేటెస్ట్ గా డ్రెస్ సెన్స్ లేదంటూ నెటిజన్స్ కొంతమందిని ట్రోల్ చేస్తున్నారు.

ఈ మధ్య హీరోయిన్ల స్టైల్ స్టేట్ మెంట్స్ కాస్త అటూ ఇటూ అవుతున్నాయి. అందుకే ఏదో స్టైల్ గా ఉంటుందనో, డిఫరెంట్ గా ఉంటుందనుకునో వేసుకున్న డ్రెస్ లు డిజాస్టర్ అయ్యి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి దొరికిపోతున్నారు ముద్దుగుమ్మలు. కరణ్ జోహార్ బర్త్ డే పార్టీతో పాటు కాన్స్, ఐఫా ఈవెంట్స్ కి వేస్కొచ్చిన డ్రెస్ ని ట్రోల్ చేసిన నెటిజన్స్ కి ఐశ్వర్యారాయ్ మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. లేటెస్ట్ గా ఐశర్వర్యా రాయ్ పాస్ పోర్ట్ లోని ఫోటోని పోస్ట్ చేయగా.. మా హీరోయిన్ నిజంగా ప్రపంచసుందరి అని ఐష్ ఫాన్స్ పాజిటివ్ కామెంట్స్ చేస్తుంటే, ఆధార్ కార్డ్ లో ఫోటో చూస్తే అప్పుడు నమ్ముతాం అసలు ఐశ్వర్యలో అందం ఎంత ఉందో అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు.

Megastar : మరోసారి వినాయక్ – చిరంజీవి కాంబినేషన్?

తాజాగా అతిలోకసుందరి కూతురు జాన్వి కపూర్ కూడా నెటిజన్స్ నోటికి అడ్డంగా దొరికిపోయింది. ముంబై జూహులోని మారియట్ లో జరిగిన ప్రైవేట్ ఈవెంట్ కి అటెండ్ అయిన జాన్వి బ్లాక్ ప్లజింగ్ నెక్ లైన్ డ్రెస్ తో అదరగొట్టింది. అయితే నెటిజన్స్ ని మాత్రం అంతగా ఇంప్రెస్ చెయ్యలేకపోయింది. బాగా స్లిమ్ అయిపోయిన జాన్విని ఓ రేంజ్ లో ట్రోల్ చేశారుసోషల్ మీడియాలో. కాస్ల్టీ పూనమ్ కపూర్ అని కొంతమంది అంటే, ఇన్ని సర్జరీలు చేయించుకుంటే కానీ అందంగా కనిపించలేకపోయావన్నమాట అంటూ కొంతమంది ట్రోల్ చేశారు.

మరో యంగ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ ని కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఓ ఈవెంట్ లో సారా అలీఖాన్ రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ హీరో కార్తిక్ ఆర్యన్ తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇద్దరూ ఫేస్ టూ ఫేస్ కనిపించడంతో అయిష్టంగానే కార్తీక్ తో ఫోటోలు దిగింది సారా. అంతేకాదు ఆ ఈవెంట్ కి వేసుకున్న బ్లాక్ సీ త్రూ డ్రెస్ లో అన్ కంఫర్టబుల్ గా ఫీలవవ్వడంతో నెటిజన్స్ అయితే అసలు నువ్వెలా హీరోయిన్ అయ్యావో ఇప్పటికీ అర్దం కావడం లేదు, ఆ డ్రెస్ నీకు అసలు సరిపోయిందా అంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇలా హీరోయిన్స్ పిచ్చి పిచ్చి బట్టలు వేసి నెటిజన్ల చేతిలో ట్రోల్స్ కి గురవుతున్నారు.