Rapido Bike Taxi: ర్యాపిడోకు షాకిచ్చిన బాంబే హైకోర్టు.. సర్వీసులన్నీ వెంటనే నిలిపివేతకు ఆదేశాలు

బైక్ టాక్సీ సర్వీస్ కంపెనీ అయిన రాపిడోకు బాంబే హైకోర్టు షాకిచ్చింది. తక్షణమే తమ సేవలన్నింటిని నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది.

Rapido Bike Taxi: ర్యాపిడోకు షాకిచ్చిన బాంబే హైకోర్టు.. సర్వీసులన్నీ వెంటనే నిలిపివేతకు ఆదేశాలు

Rapido

Rapido Bike Taxi: బైక్ టాక్సీ సర్వీస్ కంపెనీ అయిన రాపిడోకు బాంబే హైకోర్టు షాకిచ్చింది. తక్షణమే తమ సేవలన్నింటిని నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. బైక్ టాక్సీలతో పాటు కంపెనీ రిక్షాలు, డెలివరీ సర్వీసులు కూడా లైసెన్స్ లేనివేనని కోర్టు పేర్కొంది. శుక్రవారం రాపిడో టాక్సీ సర్వీస్‌కు సంబంధించి విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

TSRTC MD Sajjanar : అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థ క్షమాపణలు చెప్పాలి

2022 మార్చి 16న రాపిడో కంపెనీ పూణె ఆర్టీవో లో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది. దానిని రవాణాశాఖ తిరస్కరించింది. దీంతోపాటు రాపిడో యాప్, దాని సేవలను ఉపయోగించవద్దని రవాణాశాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. రవాణాశాఖ నిర్ణయంపై రాపిడో హైకోర్టును ఆశ్రయించింది. గతేడాది నవంబవర్ 29న తమకు అనుమతి ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని రాపిడో తరపున న్యాయవాదులు కోరారు. దీంతో బాంబే హైకోర్టు పున: పరిశీలన చేయాలని రవాణాశాఖకు సూచించింది.

 

రాష్ట్రంలో బైక్ టాక్సీలకు సంబంధించి స్పష్టమైన నిబంధన లేదని పేర్కొంటూ మరోసారి ఆర్టీఓ రాపిడో అనుమతిని తిరస్కరించింది. దీంతో తిరిగి హైకోర్టులో రాపిడో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. బైక్ టాక్సీకి సంబంధించి స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీనికి సంబంధించి కమిటీ తన నివేదికను త్వరలో సమర్పించనుంది. అయితే, అప్పటి వరకు ఈ సర్వీసును మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. దీంతో వెంటనే రాపిడో సేవలను నిలిపివేయాలని బాంబో హైకోర్టు ఆదేశించింది. దీంతో టూ వీటర్ ప్యాసింజర్ సర్వీస్, టూ వీలర్ పార్శిల్, ఆటో సర్వీస్ లు ఉన్నాయి. జనవరి 20 వరకు నిషేధం అమల్లో ఉంటుంది.