Brain : బ్రెయిన్ చురుకుగా,…ఆరోగ్యంగా ఉండాలంటే?….

చిక్కటి పెరగులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడుకు సంబంధించి అన్నిపనులకు మరియు మెదడు ఆరోగ్యాన్ని పెంచడానికి పెరుగు మంచి ఆహారం

Brain : బ్రెయిన్ చురుకుగా,…ఆరోగ్యంగా ఉండాలంటే?….

Brain To Be Active

Brain : జ్ఞానేంద్రియాలన్నింటికి కేంద్రస్ధానం మెదడు. శరీరంలోని అన్ని అవయవాల నడవడిక మొత్తం మెదడు అదేశానుసారమే ఉంటుంది. మనిషి తన దైనందిన కార్యకలాపాలను సక్రమంగా నిర్వర్తించాలంటే మెదడు పనితీరు బాగా ఉండాలి. శరీర ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాని కారణమయ్య మెదడు ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. మెదడు చురుగ్గా పనిచేసేందుకు ముఖ్యంగా ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. దీని వల్ల మెదడుపనితీరు పెరగటంతోపాటు, జ్ఞాపకశక్తి మెరుగు పెరుగుతుంది. మెదడు చురుగ్గా అలోచించాలన్నా దానికి కూడా ఎంతోకొంత శక్తి అవసరమవుతుంది. ఇందుకోసం మెదడుకు శక్తినిచ్చే ఆహార పదార్థాలను రోజువారీ మెనూలో భాగం చేసుకోవడం మంచిది.

మెదడుకు మేలు చేసే ఆహారాలు;

అరటి పళ్ళు; అరటిపండులో మెదడు పెరుగుదల, బ్రెయిన్ ఫంక్షన్స్ కు చాలా అవసరం అయ్యే మ్యాంగనీస్ పుష్కలంగా ఉంటుంది. అందు వల్ల అరటి పండ్లను తరచూ తింటుండాలి.

వాల్స్ నట్స్: వాల్ నట్స్ లోని ఫోలిఫినాల్స్ న్యూరాన్స్ మరియు బ్రెయిన్స్ మద్య కమ్యూనికేషన్ అభివృద్ధి చేస్తుంది . ఒక గుప్పెడు వాల్ నట్స్ తినడం వల్ల, మెమరీని మెరుగుపరచుకొనే అవకాశం ఉంది.

చేపలు: చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. చేపలు మెదడును చురుకుగా ఉంచడంలో బాగా సహాయపడుతాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బ్రెయిన్ కు మంచి శక్తి లభిస్తుంది.

చాక్లెట్: మెదడుకు రక్త ప్రవాహం మెరుగుపరచడం కోసం మిల్క్ చాక్లెట్ కంటే, డార్క్ చాక్లెట్ ఎక్కువగా సహాయపడుతుంది. మెదడు చురుగ్గా పనిచేయాలంటే డార్క్ చాక్లెట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి.

కాఫీ: కాఫీలోని కెఫిన్ మెదడుకు బూస్ట్ వంటిది. మెదడును చురుకుగా మారుస్తుంది. అయితే కెఫిన్ అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి ఒకటి, రెండు కప్పుల కాఫీ కంటే ఎక్కువ తీసుకోకుండా జాగ్రత్తపడండి.

పెరుగు: చిక్కటి పెరగులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడుకు సంబంధించి అన్నిపనులకు మరియు మెదడు ఆరోగ్యాన్ని పెంచడానికి పెరుగు మంచి ఆహారం

ఆలివ్ ఆయిల్ : వెజిటేబుల్ ఆయిల్ నుండి ఆలివ్ ఆయిల్ కు ప్రాధాన్యత ఇవ్వండి. ఇందులో కీళ్ళు మరియు మెదడు కణాలకు ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఫోలిఫినాయిల్స్ ను అధికంగా కలిగి ఉంటాయి.

ఆకుకూరలు: శరీరం మొత్తం మరియు మెదడుకు విస్తరించిన రక్తనాళాలకు అవసరం అయ్యే మెగ్నీషియం ఆకుకూరల్లో పుష్కలంగా ఉంటుంది. కాబట్టి బెయిన్ పవర్ కు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కూడా చాలా అవసరం.

ఫ్లాక్ సీడ్స్: ఇవి చూడటానికి చాలా చిన్న సైజులో ఉండవచ్చు. కానీ ఈ చిన్న వాటిలోనే పుష్కలమైన ప్రోటీన్స్ మరియు ఫైబర్ కలిగి ఉంటుంది. ఈ విత్తనాలు బ్రెయిన్ పవర్ ను పెంచడానికి బాగా సహాయపడుతుంది.

పుదీనా: తాజా పుదీనా వాసన మెదడు పనితీరు పెంచడానికి మరియు మెదడుకు హెచ్చరించడానికి, మెదడు చురుకుగా ఉండాటానికి సహాయపడుతుంది. బ్రెయిన్ పవర్ పెంచుకోవాలంటే ఒక కప్పు పెప్పర్ మింట్ టీ తాగండి.

స్ట్రాబెర్రీస్ : స్ట్రాబెర్రీలలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. మెదడను మరియు మెమరీని రక్షించే కొన్ని కాంపౌండ్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి స్ట్రాబెరీలను తరచూ తీసుకోవడం చాలా అవసరం.

బ్లూ బెర్రీస్: ఇవి చూడటానికి చిన్నగా ఉన్నా, ఇవి మొత్తం శరీర ఆరోగ్యంతో పాటు, బ్రెయిన్ ఫుడ్ గా కూడా వీటిని ఎక్కువగా తీసుకుంటారు. ఇది మెదడును చురుకుగా ఉంచడంతో పాటు మీరు యాక్టివ్ గా ఉండేందుకు సహాయపడుతుంది.

పసుపు: భారత దేశంలో అల్జీమర్స్ వ్యాధి వరల్డ్ లోయస్ట్ రేట్ కలిగి ఉంది. ఎందుకంటే, భారతదేశపు వంటకాల్లో కొన్ని మసాలా దినుసులు జోడించడం వల్ల మెదడుకు సంబంధించిన కొన్ని ప్రమాధకరమైన వ్యాధులను తగ్గించే అవకాశం ఉంది అంటున్నారు. ఆల్జీమర్స్ వ్యాధి మెదడులో ఒక వాపును కారణం అవుతుంది. పసుపు మసాలా దినుసుల్లో ఒకటి కాబట్టి మన రెగ్యులర్ డైల్ లో దీనికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

తృణధ్యానాలు: తృణధాన్యంతో తయారు చేసిన ఆహారాలు, బ్రెడ్, మిల్లెట్, మరియు క్వీనా వంటివి మెదడకు అద్భుతమైన ఆహారాలుగా పరిగణిస్తారు. ఈ ఆహారాలు ప్రసరణ మెరుగుపరచడానికి మరియు అవసరమైన ఫైబర్స్ మరియు విటమిన్లు అంధించడానికి సహాయపడుతాయి.

అవొకాడో: మెదడుకు సహాయపడే మంచి కొవ్వులో ఈ పండులో పుష్కలంగా ఉన్నాయి. ఇది రక్త ప్రవాహాన్నిపెంచి మెదడు ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది.

టమోటో: మెదడు కణాలను డ్యామేజ్ చేసి ఫ్రీరాడికల్స్ నుండి రక్షించడానికి, లైకోపిన్ అనే పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్ టమోటోలో పుష్కలంగా ఉన్నందున, టమోటోలను రెగ్యులర్ డైట్ లో తీసుకోవడం ముఖ్యం.

గుడ్డులో పచ్చసొన: గుడ్డు పుష్కలమైన న్యూట్రీషియన్ ఆహారం. ఇది బ్రెయిన్ పవర్ ను పెంపొందించడంలో బాగా సహాయపడుతుందని రుజువు చేయబడ్డాయి.  బ్రెయిన్ సెల్స్ కు హెచ్చరికలను అంధజేసే పోషకాంశాలు ఇందులో మెండుగా ఉన్నాయి.

బీట్ రూట్: బీట్ రూట్ డిప్రెషన్ ఫైటింగ్ వెజిటేబుల్, ఇందులో పుష్కలమైన విటమిన్ B ఉండటం వల్ల ఇది త్వరగా విషయాలను జ్ఞాపకాల ద్వారా,సమర్థవంతంగా మెదడుకు చేరవేసేందుకు సహాయపడుతుంది.

ఎండు ద్రాక్ష: ఎండు ద్రాక్ష మెమరీ పవర్ పెండంలో బాగా సహాయపడుతుంది. మెమరీ పవర్ మెరుగుపరచడానికి ఇందులో బోరాన్ అనే ఒక శక్తివంతమైన సమ్మేళన మూలకం ఉంది.

కొబ్బరి నూనె: వంటకాల్లో కొద్దిగా కొబ్బరి నూనెను కలపడం వల్ల. బ్రెయిన్ పవర్ పెంపొందించడంలో కొన్ని అద్భుతాలను చేస్తుంది. మెదడుకు ఇంధనంగా ఇది కీటోన్స్ ను సృష్టిస్తుంది.

ఓట్స్: ఈ కార్బోహైడ్రేట్ రిస్ ఫుడ్ మెదడుకు కావల్సిన శక్తిని అంధిస్తుంది. ఒక కప్పు ఓట్స్ మరియు పండ్లు తీసుకోవడం వల్ల, మెమొరీ పవర్ పెంచి మరియు ఏకాగ్రతను పెంపొందిస్తుంది.

గుమ్మడి గింజలు: ఈ గుమ్మడి గింజల్లో ట్రప్టోఫోన్ అనే మోనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ మూలకాలను కూడా సాంఘిక ఆందోళన తగ్గించే సరైన న్యూరోట్రాన్స్మిటర్ పనితీరును అవసరం!

మంచి నీరు ; బ్రెయిన్ యాక్టివ్ గా ఉండాలంటే నీళ్ళు చాలా అవసరం. మానసిక స్థితికి నీళ్ళు చాలా అవసరం.  శరీరం హైడ్రేషన్ లో ఉంచడానికి కూడా నీటి అవసరం ఎంతైనా ఉంది.  కాబట్టి, ప్రతి రోజూ కనీసం 7 నుండి 8గ్లాసుల నీళ్ళు తప్పనిసరిగా తీసుకోవాలి.