Sadagopan Ramesh : టీమ్ఇండియా దిగ్గజ ఆటగాళ్లైన సచిన్, గంగూలీలతో కలిసి ఆడిన ఈ తమిళ నటుడిని గుర్తుపట్టగలరా..?
పేరు చెబితే వెంటనే గుర్తుకు రాకపోవచ్చు గానీ అతడు టీమ్ఇండియాకు ఆడిన ఆటగాడు అని చాలా కొద్ది మందికే తెలుసు. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీ ఎస్ లక్ష్మణ్ వంటి దిగ్గజాలతో కలిసి ఆడాడు.

Sadagopan Ramesh
Tamil Actor Sadagopan Ramesh : సదగొప్పన్ రమేష్ ఈ పేరు చెబితే వెంటనే గుర్తుకు రాకపోవచ్చు గానీ అతడు టీమ్ఇండియాకు ఆడిన ఆటగాడు అని చాలా కొద్ది మందికే తెలుసు. సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), సౌరవ్ గంగూలీ (Sourav Ganguly), వీవీ ఎస్ లక్ష్మణ్ (vvs laxman) వంటి దిగ్గజాలతో కలిసి ఆడాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన రమేష్ మంచి అగ్రెసివ్ బ్యాటర్. 1999లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌తో అరంగ్రేటం చేశాడు. వసీం అక్రమ్, వకార్ యూనుస్ ల నిప్పులు చెరిగే బంతులను ఎదుర్కొని తొలి మ్యాచులో 41 బంతుల్లో 5 ఫోర్లతో 104.87 స్ట్రైక్‌రేట్‌తో 43 పరుగులు చేశాడు.
WI vs IND : భారత్‌తో తొలి టెస్టు.. విండీస్ భారీ కాయుడు వచ్చేశాడు
అప్పటి వరకు ఓపెనర్లు అంటే కొత్త బంతి పాతది చేయడమే వారి పని అన్నదిగా ఉండేది. అయితే.. రమేష్ మాత్రం ఎలాంటి భయం లేకుండా అగ్రెసివ్ ఇంటెంట్‌తో బ్యాటింగ్ చేసేశాడు. కాగా.. అతడి కెరీర్ ఎక్కువ కాలం కొనసాగలేదు. రెండున్నరేళ్ల కెరీర్‌లో(1999 జనవరి-2001 ఆగస్ట్) టీమ్ఇండియా తరుపున 19 టెస్టుల్లో 1,367 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 8 అర్థశతకాలు ఉన్నాయి. 24 వన్డేల్లో 6 అర్థశతకాల సాయంతో 646 పరుగులు చేశాడు.
క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన తరువాత దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు రమేష్ బ్యాట్ ముట్టుకోలేదు. అయితే.. 2008లో ఐపీఎల్ ఆడే అవకాశం ఉన్నప్పటికీ తన కెరీర్‌ను మార్చుకోవాలని భావించాడు. సినిమాల్లో నటించాలని అనుకున్నాడు. 2008లో తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. జయం రవి, జెనీలియా డిసౌజా జంటగా నటించిన హిట్ రొమాంటిక్ కామెడీ చిత్రం సంతోష్ సుబ్రమణ్యంలో ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా 56వ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్‌లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు. ఉత్తమ నటి అవార్డులకు ఎంపికైంది.
Sourav Ganguly : టీ20ల్లో రోహిత్ శర్మ, కోహ్లిల కెరీర్ ముగిసినట్లేనా..? గంగూలీ చెప్పింది ఇదే..
2011లో స్పోర్ట్స్ కామెడీ పొట్ట పొట్టితో రమేష్ ప్రధాన నటుడిగా మారారు. ఈ సినిమా ఓ మోస్తారుగా ఆడింది. మద గజ రాజా (ఎంజీఆర్) చిత్రంలో కూడా ప్రధాన పాత్రను పోషించాడు. పలు సినిమాల్లో నటించి చిత్ర పరిశ్రమలో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. చెన్నైలో ‘స్వరస్’ పేరుతో కరోకేలో ప్రత్యేకత కలిగిన మల్టీ-పర్పస్ స్టూడియోను రమేష్ ప్రారంభించాడు. ప్రస్తుతం అతడు క్రికెట్ వ్యాఖ్యతగా వ్యవహరించడంతో పాటు పలు రియాలిటీ టీవీ షోలకు న్యాయనిర్ణేతగా చేస్తున్నాడు.