Mamata Banerjee: ప్ర‌తిప‌క్షాల‌ను బెదిరించేందుకు సీబీఐని ప‌దేప‌దే వాడుతున్నారు: మ‌మ‌త‌

కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఇవాళ ఆ రాష్ట్రంలోని ప‌శ్చిమ బ‌ర్ధ‌మాన్ జిల్లాలో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆమె ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ... ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను బెదిరించ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం సీబీఐను ప‌దే ప‌దే వాడుకుంటోంద‌ని ఆరోపించారు.

Mamata Banerjee: ప్ర‌తిప‌క్షాల‌ను బెదిరించేందుకు సీబీఐని ప‌దేప‌దే వాడుతున్నారు: మ‌మ‌త‌

Mamata Banerjee: కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఇవాళ ఆ రాష్ట్రంలోని ప‌శ్చిమ బ‌ర్ధ‌మాన్ జిల్లాలో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆమె ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ… ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను బెదిరించ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం సీబీఐను ప‌దే ప‌దే వాడుకుంటోంద‌ని ఆరోపించారు. ఎవ‌రిని ప‌డితే వారిని సీబీఐ విచార‌ణ‌కు పిలుస్తోంద‌ని మ‌మ‌తా బెన‌ర్జీ అన్నారు. ప‌శ్చిమ బెంగాల్‌లో సీబీఐ ఓ కేసులో ఎలా వ్య‌వ‌హ‌రిస్తుందో అక్క‌డి ప్ర‌జ‌ల‌కు బాగా తెలుస‌ని చెప్పారు.

Maharashtra: రేపు బ‌ల‌ప‌రీక్ష‌.. నేడు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న మ‌హారాష్ట్ర కేబినెట్‌

పేదవాడైన ఎల‌క్ట్రిక్ రిక్షా డ్రైవ‌ర్‌కు, ఓ డాక్ట‌ర్‌కు కూడా సీబీఐ స‌మ‌న్లు పంపింద‌ని ఆమె అన్నారు. అంతేగాక‌, టీఎంసీ పంచాయ‌తీ స‌భ్యుల‌ను, ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను, జ‌ర్న‌లిస్టుల‌ను కూడా సీబీఐ పిలిచి విచారిస్తోంద‌ని మండిప‌డ్డారు. ఒకే ఒక్క కేసులో సీబీఐ దాదాపు 1,000 మందిని విచారించింద‌ని చెప్పారు. సీబీఐ వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరును ప‌ట్టించుకోకుండా అంద‌రూ త‌మ ప‌ని తాము చేసుకోవాల‌ని సూచించారు. కాగా, ప‌శువుల అక్ర‌మ ర‌వాణా కేసులో జూన్ 16న సీబీఐ ఓ రిక్షా డ్రైవ‌ర్‌కు స‌మ‌న్లు పంపింది.