Enforcement Directorate: మ‌రో 14 రోజులు జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీలోనే మంత్రి స‌త్యేంద‌ర్ జైన్

న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ విచార‌ణ ఎదుర్కొంటున్న ఢిల్లీ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్‌ జ్యుడీషియ‌ల్ కస్ట‌డీని కేంద్ర ద‌ర్యాప్తు బృందం (సీబీఐ) న్యాయస్థానం పొడిగించింది.

Enforcement Directorate: మ‌రో 14 రోజులు జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీలోనే మంత్రి స‌త్యేంద‌ర్ జైన్

Satyendra Jain

Enforcement Directorate: న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ విచార‌ణ ఎదుర్కొంటున్న ఢిల్లీ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్‌ జ్యుడీషియ‌ల్ కస్ట‌డీని కేంద్ర ద‌ర్యాప్తు బృందం (సీబీఐ) న్యాయస్థానం పొడిగించింది. మ‌రో 14 రోజుల పాటు (జూలై 11 వ‌ర‌కు) ఆయ‌న‌ జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీలో ఉండాల‌ని పేర్కొంది. ఈడీ వాద‌న‌లు విన్న అనంత‌రం ఈ నిర్ణ‌యం తీసుకుంది. కాగా, జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్న స‌త్యేంద‌ర్ జైన్ అనారోగ్య కార‌ణాల వ‌ల్ల ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయ‌న అక్క‌డి నుంచే వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు.

Maharashtra: పారిపోయిన వారు గెల‌వ‌రు.. ప్ర‌భుత్వం కుప్ప‌కూల‌దు: ఆదిత్య ఠాక్రే

గ‌త 14 రోజుల నుంచి ఆయ‌న జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీలోనే ఉంటున్నారు. 2015-16లో కోల్‌క‌తాలోని స‌త్యేంద‌ర్ జైన్ సంస్థ‌లకు సంబంధించిన‌ న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసుల్లో ఆయ‌న‌ ఈడీ విచార‌ణ ఎదుర్కొంటున్నారు. ఆ కేసులో 2017 నుంచి ఆయ‌న‌ను ఈడీ విచారిస్తోంది. స‌త్యేంద‌ర్ జైన్ దాఖ‌లు చేసిన బెయిల్ పిటిష‌న్‌ను ఇప్ప‌టికే కోర్టు తిర‌స్క‌రించింది. ఆయ‌న‌ను మే 30న అరెస్టు చేశారు. అనంత‌రం, జూన్ 7న స‌త్యేంద‌ర్ జైన్ ఇళ్లు, కార్యాల‌యాల్లో దాడులు చేసిన ఈడీ ప‌లు ప‌త్రాలు, డిజిట‌ల్ రికార్డుల‌ను స్వాధీనం చేసుకుంది.