Manipur Violence: మణిపూర్ అల్లర్లపై ఆరు కేసులు నమోదు.. విచారణ వేగవంతం చేసిన సీబీఐ

మణిపూర్ అల్లర్ల కేసును హైకోర్టు రిటైర్డ్జ్ జడ్జి నేతృత్వంలోని ప్రత్యేక కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బృందం విచారిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల ఒకటవ తేదీన ప్రకటించారు. అంతకు ముందు ఆయన మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు

Manipur Violence: మణిపూర్ అల్లర్లపై ఆరు కేసులు నమోదు.. విచారణ వేగవంతం చేసిన సీబీఐ

CBI: మణిపూర్ రాష్ట్రంలో చెలరేగిన అల్లర్లపై దర్యాప్తు ప్రారంభించిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఇప్పటి వరకు ఆరు ఎఫ్ఐఆర్‭లు నమోదు చేసినట్లు పేర్కొంది. ఈ హింసాత్మక ఘటనలపై విచారణ వేగవంతం చేసినట్లు శుక్రవారం సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇక దీనితో పాటు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సైతం విచారణలో ఉంది. సీబీఐ ఆదేశాల మేరకు సిట్ కేసులు నమోదు చేసిన విచారణ చేస్తోంది. ఈ అల్లర్లు రేగడానికి ముందస్తు ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో సైతం దర్యాప్తు సాగుతున్నట్లు సమాచారం.

Congress vs BJP: విదేశాల్లో రాజకీయాలొద్దన్న విదేశాంగ మంత్రి జైశంకర్‭కు గట్టి కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్

మణిపూర్ అల్లర్ల కేసును హైకోర్టు రిటైర్డ్జ్ జడ్జి నేతృత్వంలోని ప్రత్యేక కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బృందం విచారిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల ఒకటవ తేదీన ప్రకటించారు. అంతకు ముందు ఆయన మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి పక్షపాతానికి తావు లేకుండా, చట్టబద్ధంగా పూర్తి నిష్పాక్షికంగా దర్యాప్తు కొనసాగుతుందని మణిపూర్ ప్రజలకు తాను తెలియజేస్తున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. అలాగే అల్లర్లలో నష్టపోయిన వారికి ఆర్థిక మద్దతుతో పాటు పునరావాసం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Punjab Politics: సిద్ధూ వల్లే భగవంత్ మాన్ సీఎం అయ్యారా.. ఇంతకీ సిద్ధూ భార్య బయటపెట్టిన విషయం ఏంటి?

మణిపూర్‌లో రెండు వర్గాల మధ్య హింసాత్మక పోరు కొనసాగుతోంది. అయితే ఇవరు వర్గాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు హోంమంత్రి అమిత్ షా నాలుగు రోజుల మణిపూర్ పర్యటనలో ఉన్నారు. రాష్ట్ర పర్యటన సందర్భంగా ఆయన భద్రతా బలగాలు, పౌర అధికారులతో సమావేశాలకు సమావేశమై వివిధ చర్చలు జరిపారు. “నేను మణిపూర్‌లోని ఇంఫాల్, మోరే, చురచంద్‌పూర్‌తో సహా గత మూడు రోజుల్లో అనేక ప్రదేశాలను సందర్శించాను. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడానికి అధికారులతో సమావేశాలు నిర్వహించాను. నేను మెయిటీ, కుకీ కమ్యూనిటీల సీఎస్ఓలను కలిశాను” అని అమిత్ షా తెలిపారు.