Milkha Singh : మిల్కా సింగ్ మృతికి సెలబ్రిటీల సంతాపం..

‘ఫ్లయింగ్ సిఖ్‌’ గా పిలవబడే మిల్కా సింగ్ మరణవార్త తెలుసుకున్న వివిధ రంగాలకు చెందిన వారు నివాళులర్పిస్తున్నారు.. టాలీవుడ్ సీనియర్ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, సూపర్‌స్టార్ మహేష్ బాబు, బిగ్ బి అమితాబ్ బచ్చన్, ప్రియాంక చోప్రాతో సహా పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు.

Milkha Singh : మిల్కా సింగ్ మృతికి సెలబ్రిటీల సంతాపం..

Celebrities Condolences To Legendary Athlete Milkha Singh

Updated On : June 19, 2021 / 2:38 PM IST

Milkha Singh: ప్రముఖ అథ్లెట్, దిగ్గజ క్రీడాకారుడు, స్ప్రింటర్ మిల్కా సింగ్ (91) కన్నుమూశారు. కరోనాతో చికిత్స పొందుతూ మిల్కా తుదిశ్వాస విడిచారు. గత మే నెల 20న మిల్కా సింగ్ కరోనా బారినపడ్డారు. ఆరోగ్యం విషమించడంతో ఐసీయూలోకి తరలించారు. డిశ్చార్జి అయిన తర్వాత కూడా పలు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో జూన్ 18 రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు.

‘ఫ్లయింగ్ సిఖ్‌’ గా పిలవబడే మిల్కా సింగ్ మరణవార్త తెలుసుకున్న వివిధ రంగాలకు చెందిన వారు నివాళులర్పిస్తున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, సూపర్‌స్టార్ మహేష్ బాబు, బిగ్ బి అమితాబ్ బచ్చన్, ప్రియాంక చోప్రాతో సహా పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు.

‘‘తన రేసులతో ప్రపంచలో భారతదేశ సత్తా చూపించిన మిల్కాసింగ్ మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలని దేవున్ని ప్రార్థిస్తున్నా. 80 రేసుల్లో 77 గెలిచి తన ప్రతిభ ఏంటో ప్రపంచానికి కనబరిచారు. మిల్కాసింగ్ విజయాలతో భారతీయల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసి తిరుగులేని గుర్తింపును తెచ్చారు. గ్రామీణ క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారు. ప్రతి తరం మిల్కాసింగ్ కష్టాన్ని, విజయాలను తెలుసుకోవాలి. మంచి క్రీడాకారున్ని దేశం కోల్పోవడం బాధాకరం. మిల్కాసింగ్ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలుపుతున్నా’’ అంటూ బాలయ్య సంతాపం వ్యక్తం చేశారు.

‘‘స్పోర్ట్స్ లెజెండ్ మిల్కా సింగ్ మరణం తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. ఆయణ్ణి కోల్పోవడం మన దేశానికి ఒక స్మారక నష్టం.. వారి అద్భుతమైన వారసత్వం ప్రపంచవ్యాప్తంగా అథ్లెట్లకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.