Corona Instructions : WHO హెచ్చరికల నేపథ్యంలో.. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు

దేశంలో కరోనా కేసుల ఉధృతి మళ్లీ పెరిగింది. గత మూడు రోజుల క్రితం 10వేలకు దిగువన ఉన్న కరోనా కేసులు.. క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. శనివారం 22,775 కరోనా కేసులు నమోదయ్యాయి.

Corona Instructions : WHO హెచ్చరికల నేపథ్యంలో.. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు

Corona Instructions

Corona Instructions : దేశంలో కరోనా కేసుల ఉధృతి మళ్లీ పెరిగింది. గత మూడు రోజుల క్రితం 10వేలకు దిగువన ఉన్న కరోనా కేసులు.. క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. శనివారం 22,775 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైన్టిస్ట్ సౌమ్య స్వామినాథన్ హెచ్చరికలు చేశారు. స్వామినాథన్ హెచ్చరికలతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది.

చదవండి : Corona Cases : దేశంలో ఒకేరోజు 35 శాతం పెరిగిన కరోనా కేసులు

ఎవరైనా జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వాసన లేకపోవడం, రుచి కోల్పోవడం విరోచనాలు, అలసట లాంటి సమస్యలతో బాధ పడుతుంటే.. వారికీ కోవిడ్ సోకినట్లుగా అనుమానించాలి.. ఆలస్యం చేయకుండా వెంటనే కరోనా నిర్దారణ పరీక్షలు చేయించాలని తెలిపింది. ఒమిక్రాన్ రోజు రోజుకు విస్తరిస్తున్నందున అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు.

చదవండి : Corona Compensation : మీ డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ ఫోన్.. బిత్తరపోయిన మహిళ

మహమ్మారి బారినపడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ట్రావెల్ హిస్టరీ ఉన్నవారి శాంపిల్స్ తప్పనిసరిగా జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపాలని తెలిపింది కేంద్రం