Nitin Gadkari : ప్రారంభమైన ప్రాజెక్టులు ట్రైలర్ మాత్రమే.. సినిమా ఇంకా మిగిలే ఉంది

దేశం ముందుకు పోవాలంటే.. అభివృద్ధి ప్రధాన కీలకమన్నారు. 2014లో నేషనల్ హైవేలు 2700 కిలోమీటర్లు జాతీయ రహదారులుండేవని, ప్రస్తుతం 5 వేల కిలోమీటర్ల మేర హైవేలున్నాయన్నారు. దాదాపు...

Nitin Gadkari : ప్రారంభమైన ప్రాజెక్టులు ట్రైలర్ మాత్రమే.. సినిమా ఇంకా మిగిలే ఉంది

Gadkari (1)

Nitin Gadkari :తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైన హైవే ప్రాజెక్టులు ట్రైలర్ మాత్రమేనని.. సినిమా ఇంకా మిగిలే ఉందని కేంద్ర మంత్రి గడ్కరి కీలక వ్యాఖ్యలు చేశారు. 2022, ఏప్రిల్ 29వ తేదీ శుక్రవారం ఆయన హైదరాబాద్ కు వచ్చారు. జాతీయ రహదారులను జాతికి అంకితం చేశారు. మరో 17 జాతీయ రహధారులకు శంకుస్థాపన చేశారు. తెలంగాణలో 354 కి.మీట జాతీయ రహదారుల నిర్మాణం జరుగనుంది. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రి గడ్కరి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ప్రగతిశీల సంపన్న రాష్ట్రం. రాష్ట్రాభివృద్ధిలో నీళ్లు, విద్యుత్, రహదారులుంటే రాష్ట్రాభివృద్ధి సాధ్యమౌతుందని తెలిపారు.

Read More : Nitin Gadkari : నేడు హైదరాబాద్ కు నితిన్ గడ్కరీ.. 10 జాతీయ రహదారులకు శంకుస్థాపన.. సీఎం కేసీఆర్ హాజరవుతారా?

వివిధ భాషలున్నా.. దేశమంతా ఒక్కటేనన్నారు. దేశం ముందుకు పోవాలంటే.. అభివృద్ధి ప్రధాన కీలకమన్నారు. 2014లో నేషనల్ హైవేలు 2700 కిలోమీటర్లు జాతీయ రహదారులుండేవని, ప్రస్తుతం 5 వేల కిలోమీటర్ల మేర హైవేలున్నాయన్నారు. దాదాపు రూ. 3 లక్షల కోట్లతో తెలంగాణ రాష్ట్రంలో హైవేలు నిర్మించడం జరుగుతోందన్నారు. 8 సంవత్సరాల్లో హైవే నెట్ వర్క్ ను పెద్దదిగా చేసి చూపించామన్నారు. తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో 32 జిల్లాలను జోడించామని… మరొక జిల్లాను అనుసంధానం చేస్తామని..ఇవన్నీ నేషనల్ హైవేకు లింక్ చేయడం జరుగుతుందన్నారు.

Read More : Nitin Gadkari : హైదరాబాద్‌‌కు గడ్కరీ.. సీఎం కేసీఆర్ హాజరుపై ఉత్కంఠ

యూఎస్, అమెరికా స్టాండర్డ్ ప్రకారం హైవేలు నిర్మితమౌతాయన్నారు. 26 గ్రీన్ ఎక్స్ ప్రెస్ హైవేలు నిర్మిస్తున్నట్లు, ఇందులో 5 తెలంగాణ రాష్ట్రం మీదుగా పోతాయన్నారు. దేశంలోనే ఢిల్లీ – ముంబై హైవే పెద్దదన్నారు. హైవేలు నిర్మితవుతున్న క్రమంలో.. ప్లాన్ సిటీ, ఇండస్ట్రీయల్, లాజిస్టిక్ పార్క్ లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడం జరుగుతోందన్నారు. దీని ద్వారా రాష్ట్రానికి లాభం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వీకే సింగ్, కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నాయకులు, ఇతరులు పాల్గొన్నారు.