Nitin Gadkari : నేడు హైదరాబాద్ కు నితిన్ గడ్కరీ.. 10 జాతీయ రహదారులకు శంకుస్థాపన.. సీఎం కేసీఆర్ హాజరవుతారా?

అయితే.. గడ్కరీతో పాటు ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారా? లేదా? అనేది ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే బీజేపీపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు.

Nitin Gadkari : నేడు హైదరాబాద్ కు నితిన్ గడ్కరీ.. 10 జాతీయ రహదారులకు శంకుస్థాపన.. సీఎం కేసీఆర్ హాజరవుతారా?

Minister Nitin Gadkari

Updated On : April 29, 2022 / 7:59 AM IST

Nitin Gadkari : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ హైదరాబాద్ రానున్నారు. పది జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే రెండు నేషనల్ హైవేలను జాతికి అంకితం చేయనున్నారు. ఆ తర్వాత శంషాబాద్ జీఎంఆర్ అరైనా గార్డెన్స్‌లో ప్రారంభోత్సవ బహిరంగ సభలో పాల్గొంటారు. 7 వేల 853కోట్ల నిధులతో 354 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను కేంద్రం నిర్మిస్తోంది.

సంగారెడ్డి -నాందేడ్ – అకోల రహదారిని శంషాబాద్ వద్ద గడ్కరి ప్రారంభిస్తారు. బోయిన్‌పల్లి నుంచి కండ్లకోయ వరకు ఆరు లేన్ల రహదారి విస్తరణ, అప్పా జంక్షన్ – మన్నెగూడ రహదారి పనులను ప్రారంభించనున్నారు. గడ్కరీ కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం సీఎం‌ కేసీఆర్ సహా.. అందరకీ ఆహ్వానం పంపారు.

Central Govt : ఎలక్ట్రిక్‌ బైకులపై కేంద్రం కీలక నిర్ణయం

అయితే.. గడ్కరీతో పాటు ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారా? లేదా? అనేది ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే బీజేపీపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఎప్పటికప్పుడు కేంద్ర విధానలను తప్పుబడుతున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి మీటింగ్‌ను పక్కన పెట్టి గడ్కరీ సభకు వెళుతానని ఎంపీ కోమటిరెడ్డి చెప్పడం హాట్‌ టాపిక్‌గా మారింది.

ఇక పాదయాత్ర కారణంగా గడ్కరీ సభకు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దూరంగా ఉండనున్నారు. కేంద్రమంత్రి నితిన్ సభకు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. బహిరంగ సభకు పది వేల మంది హాజరవుతారని బీజేపీ నేతలు చెబుతున్నారు.